Tollywood Heroine.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత సక్సెస్ అయితే అలాగే అవకాశాల అందుకుంటూ కొనసాగుతారు. లేకపోతే ఒకటి రెండు చిత్రాలకే పరిమితమై, ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో బిజీ అవుతూ ఉంటారు. ఇప్పటివరకు కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలలో నటించి అవి కూడా సక్సెస్ కాకపోయేసరికి.. ఇండస్ట్రీ నుంచి దూరమై అభిమానులను నిరాశ పరుస్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్యకాలంలో కనుమరుగైన హీరోయిన్స్ కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్లు ఇప్పుడు హీరోయిన్గా ట్రై చేస్తుంటే, ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలలో హీరోయిన్ గా చేసి గుర్తింపు రాక ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు పలు రకాల పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ ఆకట్టుకుంటున్నారు.. అలాంటి వారిలో పద్మప్రియ కూడా ఒకరు.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పద్మప్రియ
ఈమె పేరు చెబితే పెద్దగా గుర్తుపట్టరు. కానీ 2010లో విడుదలైన శర్వానంద్ మూవీ “అందరి బంధువయ” అని చెబితే టక్కున గుర్తుపట్టేస్తారు. ఇందులో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత 2017 లో వచ్చిన జగపతిబాబు సినిమాలో పటేల్ సర్ సినిమాలో మాత్రమే కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ రెండు సినిమాల కంటే కూడా ఈమెకు శ్రీను వాసంతి లక్ష్మి చిత్రం మంచి గుర్తింపును అందించింది. ఈ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్నారు. అదే చార్మింగ్ తో కొనసాగుతోంది పద్మప్రియ.
సోషల్ మీడియాలో యాక్టివ్..
ఇక ఈమె తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 2017 నుంచి 2021 వరకు నటనకు కాస్త విరామం ఇచ్చినా.. 2022లో వండర్ ఉమెన్ అనే ఇంగ్లీష్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో నటించలేదు.. చాలాకాలం తర్వాత సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈమెకు సాంప్రదాయం నృత్యం పై మంచి పట్టు కూడా ఉంది. అలాగే పుస్తక పఠనం అంటే చాలా ఆసక్తి, ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టపడుతుందట. తన ఇంటి పెరట్లో రకరకాల మొక్కలు పెంచే ఈ నటీమణి ప్రస్తుతం తనకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. ఇక తాజాగా అందమైన అమ్మాయి తన ముఖంలో ఒకవైపు అమ్మాయి ఆర్ట్ వేయించుకొని ఫోటోలకు దర్శనమిచ్చింది. ప్రస్తుత మీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అంతేకాదు ఈ ఫోటోలు చూసి ఆమె ఈమెనా అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.
View this post on Instagram