Star heroine.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఏ విధంగా మోసపోతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా ప్రేమలు, డేటింగులు, మోసాలు , పెళ్లిళ్లు, విడాకులు ఇలా ఇండస్ట్రీలో అన్నీ కూడా అత్యంత సాధారణంగా మారిపోయాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మనం ఎన్నో చూసాం.. చూస్తూనే ఉన్నాం. అయితే ఒక స్టార్ హీరోయిన్ ను మాత్రం నమ్మించి మోసం చేసి చివరికి ఆమె ముఖాన్ని డబ్బు విసిరికొట్టిన హీరో కూడా ఉన్నాడు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఒకప్పుడు కమెడియన్స్ సరసన కూడా హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్ జీవితంలో ఎన్నో విషాదఛాయలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా వాటిని బయట పెట్టకుండా సంతోషంగా నలుగురితో కలిసిపోతూ ఉంటుంది. ఇంతకు ఆమె ఎవరా అంటారా..? తన అంద చందాలతో ఇంద్రుడిని సైతం మాయ చేసే ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజ.
అంద చందాలతో ఉర్రూతలూగించిన ఇంద్రజ..
తన అంద చందాలతో ఉర్రూతలూగించే ఇంద్రజ, ఒకప్పుడు బడా స్టార్స్ సినిమాలలో కూడా నటించి తన నటనతో స్టార్ సెలబ్రిటీలను కూడా మెప్పించింది. యమలీల చిత్రంలో ” నీ జీను ప్యాంటు వేసి బుల్లెమ్మో” అంటూ టైట్ జీన్స్ లో కుర్ర కారును హోరెత్తించిన ఈమె అందాన్ని అప్పుడే అంత త్వరగా మర్చిపోలేం.. ఈ సినిమాతో ఈమెకు లభించిన స్టార్ ఇమేజ్ ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతోంది. ముఖ్యంగా ఈమెకు అప్పట్లో ఎంత డిమాండ్ ఉండేదంటే అడిగినంత పారిపోషకం ఇచ్చి మరీ దర్శక నిర్మాతలు తమ సినిమాలలో అవకాశం కల్పించేవారు. అలా.కెరియర్ పీక్స్ లో ఉండగానే 2006లో ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అయిన మహమ్మద్ అబ్సర్ ను వివాహం చేసుకుంది.. వివాహం తర్వాత వెండితెరకు దూరమై ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టింది. సీనియర్ మొదలుకొని జూనియర్ హీరోల వరకు.. అందరి సినిమాలలో వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇంద్రజ ముఖానే డబ్బు విసిరిన స్టార్ హీరో..
ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తూ తన నటనతో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకెళితే, సినీ ఇండస్ట్రీలో కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఒక హీరో తో ప్రేమలో పడిందట.. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. అయితే సడన్గా వీళ్ళ మధ్య దూరం ఏర్పడింది. ఆయనతో సినిమా అవకాశాలు వచ్చినా నో చెప్పిందట ఇంద్రజ.. దీనికి కారణం అతను ప్రేమ పేరుతో ఈమెను వాడుకోవడమే. వేరే హీరోయిన్ తో ప్రేమలో ఉండడం గమనించిన ఈమె తట్టుకోలేక అడగడంతో.. నీ ఫేస్ రేంజ్, రేట్ ఇదే , ఈ డబ్బు తీసుకొని పో .. అంటూ కొంత డబ్బును ఆమె ముఖానే విసిరి ఘో రంగా అవమానించారట ఆ స్టార్ హీరో.. దీంతో కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె, మళ్లీ సినిమాలలో నటిస్తోందని సమాచారం. సోషల్ మీడియాలో తెగ జోరుగా సాగింది ఇప్పుడు ఇంద్రజ షో లు, సినిమాలు చేస్తూ హ్యాపీగా కెరియర్ను లీడ్ చేస్తోంది. ఏది ఏమైనా ఆ స్టార్ హీరో చేతిలో మోసపోయిన ఇంద్రజ కొంతకాలం ఆ బాధ నుంచి బయటపడినా.. ఆ స్టార్ హీరోకి మాత్రం కర్మ వెంటాడిందని , అతడు చాలా దీనస్థితికి చేరుకున్నాడని సమాచారం.