OTT Movie : ఫస్ట్ నైట్ రోజే భార్య వేరొకడితో…. చూడడం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం

OTT Movie : టైటిల్ ని చూసి బో*ల్డ్ మూవీ అనుకున్నారేమో. అస్సలు కాదు ఇదొక ప్రేమ కథా చిత్రం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీని చూస్తే ఇప్పుడిప్పుడే లైట్ గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఏంటి అనే ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. మరి ఈ మంచి ఫీల్ గుడ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే ఈ మూవీ పేరేంటి ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఈ సినిమాను చూశాక ప్రేమ, పెళ్లి లాంటి విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటే ఇట్టే క్లారిటీ వచ్చేస్తది. ప్రేమ కథా చిత్రం అన్నాం కాబట్టి కేవలం రొమాన్స్ మాత్రమే కాదు మంచి ఫ్యామిలీ డ్రామా, కామెడీ వంటి అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ పేరు పద్మిని. మరో  ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది ఒక మంచి మళయాల మూవీ.

Padmini movie review: This Kunchacko Boban film had the potential to scale  heights, but it chose not to | Movie-review News - The Indian Express

- Advertisement -

కథలోకి వెళ్తే…

కాలేజీ లెక్చరర్ రమేషన్ కు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లికాదు. వేరే అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి కుదిరి పెద్దల సమక్షంలో ఘనంగా జరుగుతుంది. కానీ ఫస్ట్ నైట్ రోజే ఆ అమ్మాయి రమేష్ తో కూల్ గా మాట్లాడి, అతన్ని బయటకు తీసుకెళ్లి, తాను మరో అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి, అక్కడి నుంచి తన బాయ్ ఫ్రెండ్ తో జంప్ అవుతుంది. ఇక హీరో రమేష్ ఇదంతా చూస్తూ షాక్ లో ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేక పోతాడు. అతనితో పాటే ఈ ఘటనను మరో ఇద్దరు కూడా చూస్తారు. మొత్తానికి ఫస్ట్ నైట్ రోజే అతని భార్య వేరే వాడితో లేచిపోయిందనే వార్త ఊరంతా పాకుతుంది. అందరూ అతన్ని చూసి పాపమని ఫీల్ అవుతారు.

కానీ మరి కొంతమంది రమేష్ ను పద్మిని అని పిలుస్తారు. ఆ పిలుపు హీరోకి అస్సలు నచ్చదు. ఇక మరోవైపు రమేష్ లయ అనే అమ్మాయిని సీక్రెట్ గా ప్రేమిస్తాడు. ఒకానొక రోజు రమేష్ అమ్మ ద్వారా ఆమెను కలుసుకొని లయను ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఈ అమ్మాయి విషయంలో కూడా హీరోకు షాక్ తప్పదు. అమ్మాయి ఏకంగా హీరో తమ్ముడు తోనే ప్రేమలో ఉంటుంది. వీటన్నిటి నుంచి బయటపడి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ ఆ పెళ్లి విషయంలో గొడవ జరిగి ఆగిపోతుంది. ఈ క్రమంలో రమేష్ పని చేసే కాలేజీలో పద్మిని అనే టీచర్ జాయిన్ అవుతుంది. అయితే స్కూల్లో గట్టిగా పద్మిని అనే పేరుతో ఎవరో పిలవడంతో పెద్ద గొడవ జరుగుతుంది. ఈ పద్మిని ఎవరు? హీరోకి ఆ పేరు వింటే ఎందుకు కోపం వస్తుంది? చివరికి హీరో పెళ్లి కథకు ఎలా ఎండ్ కార్డు పడింది? అనే విషయాలు తెలియాలంటే ఈ పద్మిని మూవీని తెరపై చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు