Veeranjaneyulu ViharaYatra : టైటిల్ రోల్ ఆయనదే! కానీ ఆయన్నే సినిమాలో లేకుండా చేసారు!

Veeranjaneyulu ViharaYatra : టాలీవుడ్ నటుడు సీనియర్ నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ఈ సినిమా టీజర్ ఆమధ్య విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా నరేష్ సినిమాలో బేబీ అనే కారు కోసం చేసిన వీడియో గురించి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ఆ విడియోతోనే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇకపోతే సీనియ‌ర్ నటుడు న‌రేష్, ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తెలుగు కామెడీ మూవీ “వీరాంజ‌నేయులు విహార‌యాత్ర” (Veeranjaneyulu ViharaYatra). ఈ మూవీ రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకుంది. భామ‌ క‌లాపం వెబ్ సిరీస్ నిర్మించిన నిర్మాత‌లు బాపినీడు, సుధీర్ ఈద‌ర క‌లిసి “వీరాంజ‌నేయులు విహార‌యాత్ర” పేరుతో ఓ కామెడీ మూవీని నిర్మించడం జరిగింది. ఈ సినిమాతో సుధీర్ పుల్ల‌ట్ల ద‌ర్శ‌కుడిగా పరిచయం కాబోతున్నాడు.

Brahmanandam voice over for Veeranjaneyulu ViharaYatra movie

టైటిల్ రోల్ ఆయనదే.. కానీ సినిమాలో ఉండే అవకాశం లేదు..

ఇక ఈ సినిమాలో సీనియ‌ర్ నటుడు న‌రేష్ తో పాటు కీడాకోలా ఫేమ్ రాగ్‌ మ‌యూర్‌, ప్రియా వ‌డ్ల‌మాని హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో మొన్నటివరకు మరో లెజెండరీ హాస్య నటుడు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆయనే బ్రహ్మానందం. అయితే తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేయగా, ఈ సినిమాలో ఆయన లేరని తెలుస్తుంది. చిత్రమేమిటంటే ఈ సినిమా టైటిల్ రోల్ ఆయనదే. ఈ సినిమాలో వీరాంజనేయులు బ్రహ్మానందం. అయితే రిలీజ్ చేసిన ప్రోమోలో బ్రహ్మానందం చనిపోయినట్టు చూపించగా, ఆయన ఫొటో దగ్గర అస్థికలు ఉన్నట్టు చూపించి, ఆ అస్థికలను నిమజ్జనం చేయడానికి చేసే జర్నీ నే సినిమాగా చూపిస్తున్నారని తెలుస్తుంది. అయితే బ్రహ్మానందం కనిపించకపోయినా స్టోరీ నరేషన్ ఆయనే చేస్తారని, ఆ పాత్రతో వాయిస్ ఓవర్ ఇచ్చారని ప్రోమోలో చూపించారు.

- Advertisement -

ఆగష్టు 14న స్ట్రీమింగ్…

ఇక ఈ సినిమాలో బ్రహ్మానందాన్ని చూడలేకపోతున్నందుకు అయన ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు. బహుశా సినిమాలో చూపిస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బ్రహ్మీని కాసేపు చూపించే అవకాశం ఉంది. ఇక ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమా రిలీజ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేసేయగా, ఈ సినిమాను ఆగష్టు 14న ఈటీవీ విన్ ఓటిటి లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. ఒక చిన్న ఫ్యామిలీ టూర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫన్ & కామెడీ & ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మరి వీరాంజనేయులు విహారయాత్ర ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు