Prabhas : ఆ డైరెక్టర్ కూతురు ప్రభాస్ సినిమాకు డైరెక్టర్.. ఇదేం ట్విస్ట్ మామా..

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాదు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ ఏడాది మరో సాలిడ్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాలో డార్లింగ్ లుక్ కొత్తగా ఉండటంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాకు ఓ యంగ్ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ గా చెయ్యబోతున్నాడు..

ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో కాదు.. డైరెక్టర్ మారుతి కూతురే.. డైరెక్టర్ మారుతికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా సినిమా రంగం వైపు వస్తున్నారు. మారుతి ఇటీవల జామ్ జంక్షన్ అనే ఓ మ్యూజిక్ బ్యాండ్స్ కి సంబంధించిన కాంపిటేషన్ ప్రోగ్రాం చేయబోతున్నారు. ఆ ప్రత్యేక ప్రోగ్రాంకు ఆరు మ్యూజిక్ బ్యాండ్స్ తో సెప్టెంబర్ 6న ఓ కాంపిటేషన్ ప్రోగ్రాం చేయబోతున్నారు.. దానికి హోస్ట్ గా హియా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తుంది..

Director Maruti's daughter will be the assistant director of the hit movie Raja Saab
Director Maruti’s daughter will be the assistant director of the hit movie Raja Saab

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ప్రోగ్రామ్ కు సంబందించిన ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మారుతి అండ్ ఆయన కూతురు కూడా విచ్చేసారు.. ఈ సందర్బంగా హియ పలు మీడియా ఛానెల్స్ తో ముచ్చటించారు.. అందులో భాగంగా ఆమె రాజా సాబ్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న విషయాన్ని చెప్పింది.. అలాగే నాగ్ అశ్విన్ వర్క్ అంటే ఇష్టంమని,ఎప్పటికైనా నాగ్ అశ్విన్ గారితో కలిసి పనిచేయాలి. మా తమ్ముడు మ్యూజిక్ వైపు వెళ్తున్నాడు. ప్రస్తుతం డ్రమ్మర్స్, పియానో ప్లే చేస్తున్నాడు అని తెలిపింది. దీంతో మారుతి కూతురు అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. మరికొందరు మాత్రం తండ్రి అడుగు జాడల్లో నడుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.. హియ కు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే.. అందుకే ఈ సినిమాను సెలెక్ట్ చేసుకుందని టాక్.. ఈ సినిమా హిట్ అయితే మాత్రం హియ లైఫ్ కు ఇక బ్రేకులు పడవు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు