RGV : రాజమౌళి సక్సెస్ తెలుగు సినిమా సక్సెస్ కాదు – రామ్ గోపాల్ వర్మ

RGV : ఒకప్పటివరకు టాలీవుడ్, మాలీవుడ్,శాండిల్ వుడ్, బాలీవుడ్ అంటూ మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అని అనడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమాకు ఎల్లలు లేవు అని బాహుబలి సినిమాతో ప్రూవ్ చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాహుబలి సినిమా తర్వాత విపరీతమైన గౌరవం దక్కింది. అప్పటినుంచి తెలుగు నుంచి ఒక పెద్ద సినిమా వస్తుంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

శాంతి నివాసం అనే సీరియల్ కి దర్శకత్వం వహించిన రాజమౌళి… స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకులకు ఆడియన్స్ పల్స్ తెలియాలి అని అంటూ ఉంటారు. అది నిజమైతే ఎస్ఎస్ రాజమౌళికి అది బాగా తెలుసు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఒక్క డిజాస్టర్ సినిమా కూడా తీయలేదు. అలానే ప్రతి సినిమా కూడా రాజమౌళి స్థాయిని పెంచుతూ ముందుకు వెళ్ళింది. రాజమౌళి సక్సెస్ గురించి పదిమంది పది రకాలుగా చెబుతారు. రీసెంట్ గా రాజమౌళి గురించి డాక్యుమెంటరీ కూడా ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

SS Rajamouli

- Advertisement -

ఎస్ ఎస్ రాజమౌళి గురించి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఎస్.ఎస్ రాజమౌళి సాధించిన సక్సెస్ తెలుగు సినిమా సక్సెస్ కాదు అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ రాజమౌళి ఏ గుజరాత్ లోను పుట్టి ఉన్నా కూడా కెరియర్ లో ఇంతే స్థాయికి వెళ్తాడు అంటూ రాంగోపాల్ వర్మ అన్నారు. ఎక్కడ పుట్టినా కూడా బాహుబలి ట్రిపుల్ ఆర్ వంటి సినిమాలు రాజమౌళి తెరకెక్కించేవాడు చెప్పుకొచ్చాడు. ఇకపోతే మహేష్ బాబుతో చేయబోయే సినిమా వీటన్నిటిని మించి బాప్ ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు