Babu Mohan: కిర్రాక్ ఆర్పి పై దుమ్మెత్తి పోస్తున్న బాబు మోహన్.!

Babu Mohan.. జబర్దస్త్ షో వల్ల పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ లో కిర్రాక్ ఆర్పీ కూడా ఒకరు.. అయితే ఆ తర్వాత జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పిన కిర్రాక్ ఆర్పీ పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ బిజినెస్ వైపుగా అడుగులు వేసి , బాగానే సక్సెస్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల ముందు కిర్రాక్ ఆర్పి చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ముఖ్యంగా అటు రోజాని , అల్లు అర్జున్ ని, ఇతర నేతలను కూడా నానా మాటలు అన్నారు. కిర్రాక్ ఆర్పీ కు అదిరిపోయే కౌంటర్లు వేసినప్పటికీ కూడా చాలా వల్గర్ గా మాట్లాడడం జరిగింది. దీంతో చాలామంది కిర్రాక్ ఆర్పీ పైన స్పందించడం జరిగింది. కానీ మల్లెమాల సంస్థ పైన ఆరోపణలు చేయడంతో.. తాజాగా సీనియర్ కమెడియన్ గా పేరు పొందిన బాబు మోహన్ కూడా స్పందించారు. వాటి గురించి తెలుసుకుందాం.

Babu Mohan: Babu Mohan throwing dirt on Kirrak RP.!
Babu Mohan: Babu Mohan throwing dirt on Kirrak RP.!

గడిచిన కొంతకాలం నుంచి కిర్రాక్ ఆర్పీ పలు రకాల ఇంటర్వ్యూలలో మల్లెమాల సంస్థ పైన పలు రకాల ఆరోపణలు కూడా చేశారు.. ముఖ్యంగా మల్లెమాల సంస్థ సరిగ్గా ఆహారం పెట్టదని జబర్దస్త్ ద్వారా భారీగానే కోట్ల సంపాదిస్తున్నారని, కానీ అక్కడ వసతులు కూడా సరిగ్గా ఉండవని, కమెడియన్స్ కి గౌరవం కూడా ఇవ్వరని చేసిన ఆరోపణల పైన ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపైన తీవ్రమైన ఆగ్రహాన్ని సైతం తెలియజేశారు.

బాబు మోహన్ మాట్లాడుతూ.. జబర్దస్త్ లోకి రాకముందు నీ బ్రతుకెంత.. వచ్చిన తర్వాత నీ బ్రతుకు ఎలా మారింది.. అలా వచ్చిన గుర్తింపుతోనే నీ కళ్ళు నెత్తికెక్కాయి. అసలు మల్లెమాల సంస్థ అంటే ఏమనుకున్నావ్ చిత్ర సీమకే ఒక తండ్రి లాంటి ఎమ్మెస్ రెడ్డి గారిది.. జబర్దస్త్ ను నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటూ తెలిపారు.. అది ఒక గొప్ప సంస్థ.. నీకు అన్నం పెట్టింది. ఆ సంస్థ పైన ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటి ..? అసలు నీకు సిగ్గుచేటు అంటూ తెలిపారు. అన్నం పెట్టిన చేయినే ఇలా నరికేస్తావా అంటూ కిర్రాక్ ఆర్పీ పైన కూడా ఫైర్ అయ్యారు బాబు మోహన్.

- Advertisement -

అన్నం పెట్టిన సంస్థ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తే అన్నం దొరకకుండా పోతుందని , ఎంతోమందికి పని ఇచ్చి , అన్నం పెట్టే ఆ సంస్థపై ఇలాంటి అబాండాలు వేయకూడదు.. కేవలం బాగు కోరుకోవాలి తప్ప.. ఇలాంటి విషయాలు అసలు మాట్లాడకూడదని కూడా తెలియజేశారు. తనకు కూడా జీవితాన్ని ఇచ్చింది కూడా ఈ సంస్థ.. నన్ను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ చేసింది కూడా వాళ్లే అంటూ తెలియజేశారు బాబు మోహన్. దీంతో పలువురు నెటిజన్స్ కూడా కిర్రాక్ ఆర్పీ పైన ఫైర్ అవుతున్నారు.. రోజురోజుకి కిర్రాక్ ఆర్పీ మాటలు కూడా ఎక్కువవుతున్నాయి అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు