Bollywood : ఆ స్టార్ హీరోతో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఇదే – టబు

Bollywood : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 90స్ లో స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో సినిమాలు చేసిన టబు ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్ లో కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అయినా బాలీవుడ్ లో పలువురు స్టార్స్ తో నటిస్తూ, లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో మెప్పిస్తుంది. రీసెంట్ గా ‘క్రూ’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో టబు ఓ స్టార్ హీరోతో ఇప్పటివరకు నటించకపోవడంపై పలు విషయాలు మాట్లాడింది.

Tabu gave reasons for rejecting Shahrukh Khan's films

ఆ స్టార్ హీరోతో నటించకపోవడానికి కారణం ఇదే!

అయితే టబు రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో బాలీవుడ్ సీనియర్ స్టార్ కాగా, అతనెవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. అవును… షారుఖ్ తో అరడజను సార్లు నటించే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిందట. అప్పటి స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ తో నటించిన టబు షారుఖ్ తో మాత్రం చేయలేదు. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూ లో టబు చెప్పుకొచ్చింది. ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్న‌ప్పుడు ఎవ‌రైనా స‌రే దానిని పూర్తి చేయాలి. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికి షారుఖ్ ఖాన్ తో ఒక్క సినిమా కూడా చేయలేదని, కారణం ఏంటి అంటే పెద్దగా తెలీదు అంటూనే సింపుల్ గా చెప్పేసింది. టబు రిప్లై ఇస్తూ ‘నేను నిర్మాతను కాదు.. దర్శకుడిని కూడా కాదు. షారూఖ్ ఖాన్ ఎవరితో పని చేయాలో నేను డిక్టేట్ చేయడం లేదు. అయితే నాకు ఏ సినిమాలు ఆఫర్ చేస్తారు? అనేది ముఖ్యం. నాకు వచ్చిన ఆఫర్లకు అవును, కాదు అని మాత్రమే చెప్పగలను. నిజానికి షారుఖ్ నుంచి కొన్ని ఆఫర్ లు వ‌చ్చాయి. కానీ పాత్రలు నచ్చకే రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ..

అయితే షారుఖ్ తో తాను ఫ్రెండ్లీ గానే ఉంటానని పెద్దగా ఈ టాపిక్ ఎప్పుడూ రాలేదని చెప్పుకొచ్చింది.  అయితే టబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం జోరుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గా ‘క్రూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న టబు, ప్రస్తుతం త‌న స్నేహితుడు అజయ్ దేవగన్‌ తో కలిసి ‘ఆరోన్ మే కహా దమ్ థా’ లో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక తెలుగులో ఆ మధ్య అలవైకుంఠపురంబులో సినిమాలో నటించగా, మళ్లీ మంచి పాత్ర దొరికితే చేస్తానని అప్పుడప్పుడూ చెప్తూనే ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు