Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కన్నడ బ్యూటీ సౌత్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.. అదే హవాను బాలీవుడ్ లో కూడా కొనసాగిస్తుంది.. రష్మిక బాలీవుడ్ లోకి యానిమల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.. దాంతో అక్కడ క్రేజీ ఆఫర్స్ ను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది.. ఈమె చేతిలో రెండు, మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్ లు ఉండటం విశేషం.. అయితే రష్మికకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడిందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..
అదేంటంటే.. రష్మిక తెలుగులో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. మరో పక్క బాలీవుడ్ లో ఛావా సినిమాలో కూడా భాగం అవుతుంది. ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తుడగా సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు.. ఆ సినిమా ప్రస్తుతం పుష్ప 2 తో పోటి పడుతుందని తెలుస్తుంది.. ఈ రెండు సినిమాలను గతంలో ఒకే డేట్ ను రిలీజ్ డేట్ గా లాక్ చేసుకున్నాయి. మొదట ఆగష్టు 15 న విడుదల చెయ్యాలని మేకర్స్ డేట్ ను ప్రకటించారు.. కొన్ని అనివార్య కారణాల వల్ల పుష్ప 2 డిసెంబర్ 6 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు..
ఇప్పుడు అదే డేట్ పై బాలీవుడ్ మూవీ ఛావా కూడా కన్ను వేసినట్లు తెలుస్తుంది.. అదే డేట్ న అల్లు అర్జున్ పుష్ప 2 వర్సెస్ ఛావా రెండు సినిమాలలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. రష్మిక ఏ పాత్రలో కనిపించినా జనాకు సర్ ప్రైజ్ అవుతుంటారు.. ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపిస్తూ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.. ఇక పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రని కొనసాగిస్తున్న అమ్మడు ఛావా సినిమాలో మాత్రం మహరాణిగా నటిస్తుందని తెలుస్తుంది. మరి ఏ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి..