Malavika Mohanan : ఆ షూటింగ్ టైం లో 5గురు డిఫెరెంట్ డాక్టర్స్ ను కలిసాను

Malavika Mohanan : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ దర్శకులలో పా రంజిత్ ఒకరు. రజనీకాంత్ నటించిన కబాలి సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు రంజిత్. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా ఆ తర్వాత కాలా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించుకుంది. ఇక రంజిత్ పా సినిమాలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. కొంతమంది వెట్రి మారన్ తర్వాత అంతటి టాలెంట్ ఉన్న దర్శకుడు పా రంజిత్ అని అంటూ ఉంటారు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా చాలామంది అభిమానులు రంజిత్ కు ఉన్నారు.

ఇక ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో విక్రం తంగలాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి మీనన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్లో వీళ్ళు ఎంత డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీని గురించి మాళవిక మోహన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దాదాపు తన షూటింగ్ కోసం నాలుగు నుంచి ఐదు గంటల వరకు మేకప్ కు టైం పట్టేది అంటూ రీవిల్ చేసింది.

Malavika Mohanan

- Advertisement -

ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే టైంలో తాను చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పుకొచ్చింది. నాలుగు ఐదు గంటలు మేకప్ వేసుకున్న తర్వాత సూట్ చేస్తున్న టైంలో తనకు దురదలు వచ్చేవని కళ్ళు బాగా నొప్పి పుట్టేవని చెప్పింది. అయితే ఈ సినిమా జరుగుతున్న టైంలోనే దాదాపు ఐదుగురు డిఫరెంట్ డాక్టర్స్ ను కూడా కలిసి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు