Dhanush: 50 సినిమాల్లో ధనుష్ ను టార్చర్ పెట్టిన దర్శకుడు ఎవరంటే.?

Dhanush: తమిళ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో ధనుష్ ఒకరు. ధనుష్ గురించి ప్రత్యేకంగా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు చేశాడు ధనుష్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ధనుష్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గర అయ్యాడు ధనుష్.

ఇక ప్రస్తుతం ధనుష్ దర్శకుడుగా కూడా ఒక సినిమాను చేస్తున్నాడు ఆ సినిమా పేరు రాయన్. ఈ సినిమా జులై 26న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకను తమిళ్లో జరిపారు. తెలుగులో కూడా ఈ ఆడియో లాంచ్ ను జరిపారు. అయితే తెలుగులో ఆడియో లాంచ్ ఈవెంట్లు ఎప్పటికప్పుడు చూసే అవకాశం ఉంటుంది. కానీ తమిళ్లో అలా కాదు ఆ ఈవెంట్ ని కూడా ప్రాపర్ గా ఎడిట్ చేసి పార్ట్స్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా 26న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ ఈవెంట్ లోని ఒక్కొక్కరి స్పీచ్ ని రిలీజ్ చేశారు.

ఇక రీసెంట్ గా ధనుష్ ఇంకా సెల్వ రాఘవన్ మధ్య జరిగే ఒక కాన్వర్జేషన్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనిలో అనేక ఆసక్తికరమైన విషయాలను ఇద్దరూ ఆన్ స్టేజ్ పై మాట్లాడుకున్నారు. ఒక దర్శకుడిగా ధనుష్ కి ఎన్ని మార్కులు ఇస్తారు అని అడిగితే సెల్వ రాఘవన్ మాట్లాడుతూ 98% మార్కులు ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అలానే ధనుష్ ని పరిపూర్ణంగా వాడుకున్న దర్శకుడు ఎవరు అని అంటే వెట్రిమారన్ పేరు చెప్పాడు.

- Advertisement -

Who is the director who tortured Dhanush in 50 movies?

టార్చర్ పెట్టిన దర్శకుడు

ఇక ఈవెంట్లో ధనుష్ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ధనుష్ చేస్తున్న 50వ సినిమా రాయన్. అయితే ఈ 50 సినిమాల కెరియర్ లో తనను ఎక్కువగా టార్చర్ పెట్టిన దర్శకుడు ఎవరు అంటే తన అన్నయ్య సెల్వ రాఘవన్ పేరు చెప్పాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ధనుష్ దర్శకత్వంలో సెల్వ రాఘవన్ కూడా నటించాడు. ఈ సినిమాలో ధనుష్, సెల్వ రాఘవన్, ఎస్ జె సూర్య, సందీప్ కిషన్ , అపర్ణ బాలమురళి వంటి ప్రముఖ నటులు కనిపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. జులై 26న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు