Actresses : కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర అనే పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని పవిత్రలు షేక్ చేస్తున్నారు. మొన్న పవిత్ర లోకేష్, నిన్న పవిత్ర జయరాం, నేడు పవిత్ర గౌడ.. వీరి పేరు వెనుక ఏదైన కూడా పవిత్ర అనే పేరు అయితే కామన్. వీరంతా కన్నడ ఇండస్ట్రీలో ఒకప్పుడు సీరియల్స్ లో మెరిశారు.. సీరియల్స్, సినిమాలు ఏమో కానీ వీరి వల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చిందన్న మాట మాత్రం వాస్తవం.. శాండిల్ వుడ్ లో పవిత్ర అనే పేర్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.. ఆ ముగ్గురు పవిత్రలు పేరుకు మాత్రమే.. కానీ చేసే పనులు ఓ రేంజ్లో ఉంటాయన్న విషయం తెలిసిందే.. అసలు వీరి చరిత్రల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పవిత్ర లోకేష్..
ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. కొన్నాళ్ళ క్రితం పవిత్ర లోకేష్ నటుడు నరేష్ తో ప్రేమాయణం సాగించింది.. ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. వీరిద్దరి రిలేషన్ గురించి గత ఏడాది బయటపెట్టారు.. సినిమాలో స్టంట్ అంటూ మొత్తానికే ఇద్దరు బాగా దగ్గరయ్యారు.. ఆ తర్వాత ఎన్ని వివాదాలు వచ్చాయో తెలిసిందే.. ఈ మధ్య సోషల్ మీడియాలో వీరిద్దరూ ట్రెండింగ్ లో ఉన్నారు..
పవిత్ర జయరాం..
కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర జయరాం గురించి అందరికీ తెలుసు.. తెలుగులో కూడా ఈమె సీరియల్స్ చేశారు.. ఎన్నో హిట్ సీరియల్స్ నటించి మెప్పించింది.. తెలుగులో ఈమె చివరగా నటించిన సీరియల్ త్రినయని.. యాక్సిడెంట్ వల్ల చికిత్స పొందుతూ మృతి చెందింది.. ఈమె కూడా నటుడు జయరాం తో రిలేషన్ లో ఉందన్న సంగతి తెలిసిందే.. తనతో పదేళ్లుగా వేరే కాపురం పెట్టింది.. అలా వీరి మ్యాటర్ అందరికీ తెలియడంతో ఆమె ప్రియుడు కూడా ఉరివేసుకొని చనిపోయాడు.. కన్నడ ఇండస్ట్రీని తల ఎత్తుకొలేకుండా చేసింది..
పవిత్ర గౌడ..
దర్శన్, నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శించిన రేణుకాస్వామిని దారుణంగా హత్యకు గురి అయ్యారు. చిత్రదుర్గకు చెందిన ఫార్మసీలో పనిచేసే రేణుకా స్వామిని బెంగళూర్ తీసుకువచ్చి హింసించి హత్య చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒక్కసారి కన్నడ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.. పవిత్ర ఇప్పుడు ప్రగ్నెంట్ అన్న వార్తలు కూడా ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది.. ప్రస్తుతం ఈమె కష్టడిలోనే ఉన్నారు..
మొత్తంగా చూసుకుంటే పవిత్ర అనే పేర్లు వేరు కానీ వీరు ముగ్గురు కూడా పెళ్ళైన వ్యక్తులతో సహజీవనం చేశారు… అదికూడా వేరేకరిని పెళ్లిళ్లు చేసుకున్న వారినే వీళ్లు ప్రేమించారు..