Manchu Vishnu : ఇప్పుడు 18… ఈ స్పీడ్ ఏదో ‘మా’ బిల్డింగ్ పైన చూపించండి అధ్యక్షా…

Manchu Vishnu : సినీ నటీనటుల పై యూట్యూబ్ లో అసభ్యకరమైన ట్రోలింగ్ జరుగుతుందని విషయం తెలిసిందే.. నటుల పై కొన్ని ఛానెల్స్ దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారన్న ఆరోపణల పై మా అసోసియేషన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే.. ఈ విషయం పై గత కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు మండిపడిన విషయం తెలిసిందే.. ఆయన 5 ఛానెల్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించడమే కాదు. తెలంగాణ డీజిపీకి ఫిర్యాదు చేశారు.. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని మూవీ ఆర్టిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక సైబర్ క్రైమ్ టీమ్ ను ఏర్పాటు చెయ్యాలని కోరారు.. తాజాగా మా అసోసియేషన్ మరో 18 ఛానెల్స్ పై కొరడా జూలిపించింది..

మూవీ ఆర్టిస్ట్ ల పై ట్రోలింగ్ చేస్తున్న ఛానెల్స్ ను ఒక్కొక్కటి తొలగిస్తున్నారు.. ఈ క్రమంలో ఇప్పుడు మరొక 18 చానల్స్ ని తొలగిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 18 యూట్యూబ్ ఛానల్స్ ని తొలగించినట్లుగా వాటి పేర్లు, యూట్యూబ్ ఛానల్ యుఆర్ఎల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.. అంతేకాదు భవిష్యత్ తో ఇలాంటి సినీ నటుల పై అసభ్య ప్రచారం చేస్తే ఆ వీడియోపై ఒక రిపోర్ట్ తయారు చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు అందించనున్నట్లు మా అధ్యక్షులు మంచు విష్ణు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Manchu Vishnu has once again given a warning to 18 YouTube channels
Manchu Vishnu has once again given a warning to 18 YouTube channels

ఇదిలా ఉండగా.. మంచు విష్ణు చేస్తున్న పనిపై కొందరు ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.. గతంలో ఈ విషయం పై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్థావించారు. ఇలాంటి వాటిని అరికట్టాలి అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు.. అలాంటిది ఇప్పుడు నువ్వు ఏదో చేస్తున్నట్లు చేస్తున్నావ్.. ఆర్టిస్టుల పై ట్రోల్స్ రావడం సహజం. అంతమాత్రానికే బ్యాన్ చెయ్యాలి అంటున్నావు.. ఇది అంత ముఖ్యమైనది కాదు.. మా అసోషియేషన్ అధ్యక్షుడుగా భాధ్యతలు తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చు. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ లు పడుతున్న కష్టాలను తీర్చు.. మా బిల్డింగ్ ను ఏర్పాటు చేసేందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించు.. ఎలాంటి పనులు చేస్తే ఆర్టిస్టులు సంతోషంగా ఉంటారో అది ఆలోచించు అని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.. ఏదేమైనా ఆర్టిస్ట్ ల మనోభావాలను దెబ్బ తీస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం మంచి విషయమే.. మీరు చేస్తున్న ఈ పనికి filimify సపోర్ట్ గా ఉంటుంది..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు