VD12: లుక్ ఇలా ఉంది అని తెలియగానే , ఓన్ ఎడిట్స్ మొదలుపెట్టిన ఫ్యాన్స్

VD12: ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా డీసెంట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో రిషి అనే పాత్రలో కనిపించాడు విజయ్. ఈ సినిమా కంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించడం వలన ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాగ్ అశ్విన్ తో విజయకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. అక్కడితో నాగి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్రను విజయ్ కి ఇస్తూ ఉంటాడు. కల్కి సినిమాలో అర్జునుడు పాత్రలో కనిపించాడు విజయ్.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక స్టార్ డం సాధించుకున్నాడు. విజయ్ తప్ప ఇంకెవరు ఆ పాత్రను చేయలేరు అనే విధంగా నటించాడు. ఆ సినిమా తర్వాత విజయ్ వరుస అవకాశాలు వచ్చాయి. వాటిలో రెండు సినిమాలు హిట్ కూడా అయ్యాయి. కానీ ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి. విజయ్ దేవరకొండ ఒక హిట్ సినిమా చేసి చాలా ఏళ్ళు అవుతుంది. విజయ్ దేవరకొండ నుంచి డిజాస్టర్ సినిమా వచ్చినా కూడా ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ప్రస్తుతం భారీ లైన్ అప్ ను తన కెరీర్లో సెట్ చేశాడు. విజయ్ తర్వాత చేస్తున్న అన్ని ప్రాజెక్టుల పైన కూడా మంచి నమ్మకాలు ఉన్నాయి.

 VD12 Sets LEAKED

- Advertisement -

ఇక విజయ్ తన కెరీర్ లో 12వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి గౌతం దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ లీక్ అయిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలావరకు లీకైన ఫోటోలను చాలామంది చూశారు కూడా. అయితే లీక్ పీక్ చూడని కొంతమంది సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను బట్టి సొంతంగా ఎడిట్ చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఒరిజినల్ ఫోటో తెలియకపోతే నిజంగానే ఇది సినిమా నుంచి రివీల్ చేసిన స్టిల్ అనిపించేలా ఎడిట్ చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.

శ్రీలంకలో షూటింగ్

ఇకపోతే ఈ లీక్ పిక్ గురించి స్పందిస్తూ చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ ను చేసింది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రివిల్ చేయనున్నట్లు తెలిపారు. అలానే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం వరకు పూర్తయిపోయింది. కేవలం 40 శాతం మాత్రమే మిగిలి ఉంది. నెలరోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ లుక్కు చూసిన తర్వాత ఈ సినిమా పైన అంచనాలు మరింత పెరిగాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు