Tollywood Heroine.. సౌత్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ఊహించని క్రేజ్ అందుకొని , తన నటనతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రముఖ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో నటించడమే కాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో కూడా నటిస్తూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే ఈమధ్య హీరోయిన్స్ గా కొత్త వారు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో అవకాశాలు ఈమెకు తగ్గిపోయాయి.. కొన్నాళ్లు నెట్టింట సందడి చేస్తూ ఆఫర్స్ కోసం తెగ వెయిట్ చేసిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా అవార్డు లభించింది.
ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు..
ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు అందుకోవడంతో ఆ అవార్డుతో ఫోటోలకు ఫోజులిచ్చింది కూడా. అవార్డు చేతుల్లో పట్టుకొని తెగ మురిసిపోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఐశ్వర్య లక్ష్మి. మలయాళం మూవీ నందాల్వార్ నాడ్ నాడు ఓరిత వేళ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మాయా నది సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకొని మలయాళం లోనే కాకుండా తెలుగు, తమిళ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత అమ్ము సినిమాతో మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా నేరుగా ఓటీటీ లో విడుదలై ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఈ చిత్రంలో ఈమె సహజ నటనకు ఉత్తమ నటిగా నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డు లభించింది. ఏది ఏమైనా ఈ అవార్డుతో ఫోటోలకు ఫోజులిస్తూ అందరిని ఆకట్టుకుంది మీ ముద్దుగుమ్మ.
అవార్డ్ తో మురిసిపోతూ ఫోటోలకు ఫోజులు..
ఈ ఫోటోలను షేర్ చేస్తూనే అమ్ము చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు లభించింది. అమ్ము సినిమా కోసం, నన్ను ఆదరించి నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించి ఎదగడానికి వేదిక ఇచ్చినందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో కి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను అంటూ పోస్ట్ కూడా చేసింది. ముఖ్యంగా ఐశ్వర్యతో పాటు ఈ సినిమాలో హీరోగా నటించిన నవీన్ చంద్ర కూడా ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. అలాగే అమ్ము సినిమాకి బెస్ట్ స్టోరీ అవార్డు , బెస్ట్ రీజినల్ ఫిలిం వంటి అవార్డులు కూడా వచ్చాయి. తనతో పాటు తన టీం కి కూడా అవార్డు రావడంతో సంతోషంగా ఉందని స్పష్టం చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అవార్డు వేడుకలలో డీప్ గ్రీన్ ఆఫ్ షోల్డర్ గౌన్ లో ఐశ్వర్య లక్ష్మి మరింత అందంగా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. అవార్డు వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఈ అవార్డు చేత పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీర్పు అభిమానులు ప్రశంసల కురిపిస్తున్నారు.
View this post on Instagram