Megastar With Family : తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో, తెలుగు ప్రేక్షకులకు ఎంతగా వినోదాన్ని అందిస్తారు. అలానే తన ఫ్యామిలీ కూడా సరైన సమయానికి కేటాయిస్తారు కొంతమంది స్టార్ హీరోలు. ఇక స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు తన ఫ్యామిలీతో పాటు ఫ్లైట్ ఎక్కి ట్రిప్స్ కి వెళ్తుంటారు. కేవలం తను మాత్రమే కాకుండా ఫ్యామిలీ అందరితో పాటు హాయిగా గడుపుతూ బోలెడన్ని జ్ఞాపకాలను ఆ ఫ్యామిలీకి ఇస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా అంతే అని చెప్పొచ్చు.
దాదాపు ఐదు పదుల వయసులో కూడా సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. అసలు మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అంటేనే చాలామంది అభిమానులకు ఒక పండగ రకమైన వాతావరణం నెలకొంటుంది అని చెప్పొచ్చు. చాలామందికి చిరంజీవి ఆదర్శం, చాలామందికి చిరంజీవి అభిమాన హీరో, చాలామందికి చిరంజీవి దైవం, ఇలా ఒకటేమిటి ఎంతోమంది ఎన్నో రకాలుగా మెగాస్టార్ చిరంజీవిని చూస్తారు. అయితే ఒకవైపు సినిమాలకు ఎంత టైం కేటాయిస్తారో అలానే తనకంటూ ఉన్న ఫ్యామిలీ కూడా అంతే టైం కేటాయిస్తారు. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీ అంతటితో పాటు ట్రిప్స్ కు బయలుదేరుతారు.
ఇక రీసెంట్ గా మెగాస్టార్ పారిస్ వెళ్ళనున్నారు. అయితే ఈ వెళ్లే మార్గంలో లండన్ లోని తన ఫ్యామిలీతో పాటు కొంత టైం గడుపుతున్నారు మెగాస్టార్. మెగాస్టార్ ఫ్యామిలీతో సహా పారిస్ కు బయలుదేరారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, తన సతీమణి సురేఖ, అలానే కోడలు ఉపాసన, కొడుకు రామ్ చరణ్ లండన్ హైడ్ పార్కులో ఒక సాయంత్రం పూట దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోతో పాటు గ్రాండ్ లిటిల్ వన్ క్లీన్ కారా తో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు మెగాస్టార్. సమ్మర్ ఒలింపిక్స్ 24వ ప్రారంభ ఈవెంట్ బెకెన్స్ అంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ డాటర్ క్లీన్ కారా చూడాలని చాలామంది మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్యామిలీ అంతా బయట కనిపించినా కూడా ఇప్పటివరకు క్లింకార ఫేస్ రివిల్ చేయలేదు. ఇక ఇప్పుడు పెట్టిన ఫోటోలో కూడా చాలా తెలివిగా ఫేస్ కనిపించకుండా అప్లోడ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోని చూసి సంబరపడుతున్నారు.
Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow!
Summer Olympics 24 Inaugural Event Beckons 🙂 pic.twitter.com/bFa31zBh3a
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024