Skn: తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలామంది తెలుగు దర్శకులు తెలుగు హీరోలు తెలుగు నిర్మాతలు ఇష్టపడే ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం హీరోనే కాదు మన ఇంట్లో ఒక మనిషి. అందుకే చాలామంది మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. లేకపోతే చిరంజీవి కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి. అయితే మెగాస్టార్ కెరియర్ లో పీక్ హిట్ సినిమా అంటే ఇంద్ర అని చెప్పాలి. ఎన్నో రికార్డును సొంతం చేసుకొని ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించింది.
ఇకపోతే ఈ సినిమాని 90s కిడ్స్ ఎంతలా ఎంజాయ్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కథతో పాటు పరిచూరు బ్రదర్స్ అందించిన డైలాగ్స్, మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్స్ ఇలా ఎన్నో అంశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా ఒక హై ఫీల్ ఇస్తుంది. చాలా సీన్స్ ఈ సినిమాకి మేజర్ హైలెట్ గా నిలిచాయి. మొదటిసారి ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ కూడా క్యాసెట్ రూపంలో విడుదల చేశారు. ఈ సినిమాతో ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఈ సినిమాతో తనకున్న ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నాడు యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్.
ఎస్ కే ఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిపోర్టర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన ఎస్కేఎన్ నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఎస్కేఎన్ మెగా ఫ్యామిలీకి ఎంత పెద్ద అభిమాని అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఒక మాటని ఇస్తూ, ఒక పేద కుటుంబానికి ఆటోను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇకపోతే ఇంద్ర సినిమాతో తనకు ఉన్న అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు ఎస్కేఎన్. ఆ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతున్న ఫోటోను కూడా ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
22 glorious years of Megastar @KChiruTweets gari #Indra
A film close to my heart
Here is the photo of my speech of Indra success meet at Eluru ❤️💕
Watched 35 times in theater
Vintage Mega memories
#50YearsOfVyjayanthiMovies #22YearsForIHIndra @AshwiniDuttCh #BGopal… pic.twitter.com/fqh0mYrS9g— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 24, 2024