Arjun das..ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం లాంటివి సహజంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ విలన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న అర్జున్ దాస్ కూడా ప్రేమలో పడ్డారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఒక అమ్మాయిని పట్టుకొని వెనుక నుంచి ఉన్న ఫోటోలను అర్జున్ దాస్ తన సోషల్ మీడియా స్టేటస్ లో షేర్ చేసుకున్నారు. దీనికి తోడు లవ్ సింబల్ ని కూడా జోడించడం జరిగింది. దీంతో ఈ ఫోటోలు కాస్త సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో అర్జున్ దాస్ ప్రేమలో పడ్డారు అని, మరి ఆ అమ్మాయి ఎవరు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఐశ్వర్య లక్ష్మి యేనా..
ఇకపోతే మరొకవైపు ఈ అమ్మాయి ఐశ్వర్య లక్ష్మి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఎందుకంటే అమ్ము సినిమా తర్వాత ఐశ్వర్య లక్ష్మి ఇంస్టాగ్రామ్ వేదికగా అర్జున్ దాస్ తో ప్రేమలో పడినట్లు అతనితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. పైగా లవ్ ఎమోజి కూడా పంచుకుంది. గత ఏడాది జనవరిలో ఈమె ఈ పోస్ట్ పెట్టగా ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి.. అయితే తాము ప్రేమలో ఉన్నామని ఐశ్వర్య లక్ష్మి పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది కానీ ఈ విషయంపై అర్జున్ స్పందించలేదు.. కానీ ఇప్పుడు ఏకంగా వెనుక నుండి ఉన్నట్టు ఒక ఫోటోని పంచుకోవడంతో ఈమె ఐశ్వర్య లక్ష్మి యేనా.. లేక ఇంకొకరు ఎవరైనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.. ఏది ఏమైనా అర్జున్ దాస్ పంచుకున్న ఈ ఫోటో మాత్రం ఆయన ప్రేమలో పడ్డారు అనే విషయాన్ని పై క్లారిటీ ఇస్తోంది. మరి అమ్మాయి ఎవరన్నది ఇంకా స్పష్టత కాలేదు.
అర్జున్ దాస్ కెరియర్..
కెరీర్ విషయానికి వస్తే కోలీవుడ్ నటుడైన ఈయన.. 2012లో తమిళ సినిమా పెరుమాన్ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. 2019లో విడుదలైన కైతీ (ఖైదీ)సినిమాలో అన్భూ పాత్రలో నటించి మంచి పేరు సొంతం చేసుకోవడమే కాదు అవార్డులు కూడా దక్కించుకున్నాడు. మాస్టర్, విక్రమ్ వంటి చిత్రాలలో నటించి భారీ క్రేజ్ దక్కించుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేసి ఇక్కడ కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు అర్జున్ దాస్. ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ అలరిస్తున్న అర్జున్ దాస్ బుట్ట బొమ్మ సినిమాలో కూడా నటించారు.
మల్టీ టాలెంటెడ్ కూడా…
సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. అంతేకాదు మ్యూజిక్ వీడియోలు కూడా చేసిన ఘనత ఈయన సొంతం .అలాగే టెలివిజన్ రంగంలో కూడా పనిచేశారు.అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా పనిచేసి మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు సొంతం చేసుకున్నారు అర్జున్ దాస్.
View this post on Instagram