Balakrishna 50 Years Event : ఇండస్ట్రీలోనే భారీ ఈవెంట్… మెగాస్టార్ వచ్చేనా?

Balakrishna 50 Years Event.. స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా.. నందమూరి నటసింహ బాలకృష్ణ .. తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల అనే సినిమా ద్వారా 14 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బాలకృష్ణ.. ఇక ఈ ఏడాదితో బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు. ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణానికి పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు , అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Balakrishna 50 Years Event : A huge event in the industry... Will the megastar come?
Balakrishna 50 Years Event : A huge event in the industry… Will the megastar come?

హీరోగా ఇండస్ట్రీకి 50 ఏళ్లు.. గ్రాండ్ ఈవెంట్..

ఇకపోతే బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇండస్ట్రీలో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో సౌత్ ఇండియా సినీ సెలబ్రిటీలతో బాలకృష్ణ 50 ఏళ్ల ఇండస్ట్రీ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈవెంట్ కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని, ఎవరెవరిని పిలవాలి.. అనే అంశాలపై బాలకృష్ణ తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఈవెంట్ కి ఆహ్వానిస్తారా? ఒకవేళ ఆహ్వానిస్తే మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈవెంట్ కి హాజరవుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవిపై బాలకృష్ణ విమర్శలు..

నిజానికి బాలకృష్ణ , మెగాస్టార్ చిరంజీవి రెండవ తరం జనరేషన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. సినిమాల పరంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీపడ్డారు కూడా. నిజానికి బయట కనిపించినప్పుడు సన్నిహితంగా ఉన్నట్లు వ్యవహరిస్తారు.. కానీ వీరి మధ్య సినిమా వార్ జరుగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనికి తోడు రాజకీయంగా చిరంజీవిని బాలకృష్ణ విమర్శించారు. రాజకీయ జీవితం అంటే అందరికీ సాధ్యం కాదు అని కేవలం కొంతమంది మాత్రమే రాజకీయ జీవితంలో సక్సెస్ అవుతారని చిరంజీవిని ఉద్దేశిస్తూ బాలకృష్ణ కామెంట్లు చేశారు. రాజకీయం అనేది వారసత్వం అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

నాగబాబు కౌంటర్..

ఇకపోతే చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి గతంలో చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఎందుకంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక పార్టీని కొనసాగించలేక కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్రమంత్రిగా పనిచేశారు. అందుకే బాలకృష్ణ ఇలాంటి కామెంట్లు చేశారు. అయితే దీనిపై రియాక్ట్ అయిన నాగబాబు ఒక గొప్ప వ్యక్తిని అనే స్తోమత నీకు లేదంటూ బాలకృష్ణకు కౌంటర్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

చిరంజీవి వస్తారా..?

అటు సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య గొడవలు కూడా తారస్థాయికి చేరాయి.. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ సక్సెస్ ఈవెంట్ కి చిరంజీవిని ఆహ్వానిస్తారా? ఒకవేళ ఆహ్వానిస్తే ఆయన వస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పూర్తి వివరాలు తెలియాలి అంటే సెప్టెంబర్ 1న జరిగే ఈవెంట్ వరకు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు