Mahesh Babu.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు సినిమాల ద్వారా, పలు యాడ్స్ ద్వారా బిజినెస్ లో కూడా చేయి వేసి కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.. అయితే ఎంత సంపాదించినా కూడా సమాజసేవ కూడా ఉండాలని ఆలోచించే అతి తక్కువ మంది సెలబ్రిటీస్ లో మహేష్ బాబు ప్రథమ స్థానంలో ఉంటారు. అందుకే ఎప్పటికప్పుడు సమాజసేవ చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ముఖ్యంగా వేల కోట్ల రూపాయలను సంపాదిస్తున్న మహేష్ బాబు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయిస్తూ.. గొప్ప మనసును చాటుకుంటున్నారు. అయితే ఇప్పటికే వెయ్యి మందికి పైగా పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిన్నపిల్లల కోసం ప్రతి ఏటా ఎంత ఖర్చు పెడతారు అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.
ఆ సమస్య నుంచి పుట్టిందే ఈ ఆలోచన..
అసలు విషయంలోకి వెళ్తే.. తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన సమయం లో గుండె సంబంధిత సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. డబ్బులు ఉన్నప్పటికీ కూడా తమ కొడుకును కాపాడుకోవడం కోసం ఎన్నో అవస్థలు పడ్డారు ఈ జంట. ఇంత ఆస్తి ఉన్నప్పటికీ తాము ఇన్ని కష్టాలు పడ్డామంటే ఇక నిరుపేదలు తమకు పుట్టిన పిల్లలను కాపాడుకోవడానికి ఇంకా ఎంత కష్టపడతారు అని ఆలోచించిన మహేష్ బాబు.. చిన్న పిల్లల ఆరోగ్యం కోసం ముఖ్యంగా గుండెకు శస్త్ర చికిత్స చేయించడానికి నడుము కట్టాడు. అలా తన కొడుకు అనారోగ్య సమస్యల నుంచి పుట్టిందే ఈ ఆలోచన. అందుకే చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయిస్తూ ఎంతోమంది తల్లిదండ్రుల ప్రేమాభిమానాలను, దేవుళ్ళ ఆశీస్సులను కూడా పొందుతున్నారు.
చిన్నపిల్లల ఆపరేషన్లకు ఏడాదికి రూ.30 కోట్లు.
ఇకపోతే మహేష్ బాబు వెయ్యి మందికి పైగా ఆపరేషన్లు చేయించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఇకపోతే ఈ ఆపరేషన్ల కోసం ప్రతి ఏటా రూ .25 నుంచి రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట మహేష్ బాబుతన వార్షిక ఆదాయంలో 30% చిన్నారులను బ్రతికించడానికి కేటాయిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మహేష్ బాబు చేస్తున్న ఈ గొప్ప సేవకు నిజంగా ధన్యవాదాలు తెలపాల్సిందే.
మహేష్ బాబు సినిమాలు..
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న మహేష్ బాబు, ప్రస్తుతం రాజమౌళి సినిమాలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో పాటు రాజమౌళి కూడా ఎన్నో కసరత్తులు చేస్తున్నారు..అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబు కూడా తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే సినిమా సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో నాలుగు సంవత్సరాలు మహేష్ బాబు ఈ సినిమాకే తన సమయాన్ని కేటాయించబోతున్నారని చెప్పవచ్చు.