Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీకి హ్యాండ్ ఇచ్చిన డార్లింగ్… నెక్స్ట్ ఏంటి?

Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కు ఇంకా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న డార్లింగ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. దీంతో ఈ బ్యూటీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హ్యాండ్ ఇచ్చిన డార్లింగ్

నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మొదటి సినిమాతోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఈ అమ్మడు ఆ తరువాత పలు సినిమాలలో నటించినప్పటికి బ్రేక్ రాలేదు. అయితే ఆమె నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎట్టకేలకు కన్నడ బ్యూటీ నభా నటేష్‌కు ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ ను మలుపు తిప్పే సినిమా పడింది. కానీ ఆ తరువాత ఆమె రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ గాయాల నుంచి కొలుకోవడానికి కొంతకాలం నటనకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా డార్లింగ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక తన ఆశలన్నీ ‘డార్లింగ్’ పైనే పెట్టుకుంది. కానీ డార్లింగ్ మాత్రం హ్యాండ్ ఇచ్చాడు.

Image

- Advertisement -

ఫెయిల్యూర్ కు నభానే కారణమా?

డార్లింగ్‌ సినిమాతో తన కెరీర్‌ను మళ్లీ ప్రారంభించాలని నభా ఆశించినప్పటికీ, ఆ చిత్రం థియేటర్లలోని పేలవమైన ప్రదర్శన ఆమె ఆశలపై గట్టిగానే దెబ్బేసింది. ఆమె ప్రియదర్శి సరసన హీరోయిన్ గా పూర్తి-నిడివి, నటనకు ఆస్కారం ఉన్న పాత్రను పోషించినప్పటికీ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. రిలీజైన మొదటి రోజు నుంచే డార్లింగ్ నెగెటివ్ రివ్యూలను అందుకుంది. మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ పేరును ఉపయోగించుకుని ప్రమోషన్స్ బాగానే చేసినప్పటికీ డార్లింగ్ మూవీ వీక్షకులను ఆకర్షించడంలో ఫెయిల్ అయ్యింది. ఫలితంగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. నభాకు ఈ పాత్రలో మెరిసే అవకాశం వచ్చినప్పటికీ, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పాత్రలో ఆమె నటనతో అందరినీ తన మాయలో పడేయడంలో విఫలమైంది. కనీసం నభా అంచనాలను అందుకోలేకపోయింది. కథ, కథనం కాకుండా ఆమె నటన ఈ సినిమాకు మెయిన్ మైనస్ పాయింట్ అన్నారు విమర్శకులు. ఒకవేళ ఆమె నటన క్లిక్ అయితే, సినిమా విఫలమైనప్పటికీ, ఖచ్చితంగా అది ఆమె కెరీర్‌కు ఊపిరి పోసేది. కానీ ఈ ఫెయిల్యూర్ వల్ల ఆమె యాక్టింగ్ పరంగా తన టాలెంట్ ను నిరూపించుకునే ఓ పెద్ద అవకాశాన్ని కోల్పోయిందనే చెప్పాలి.

నభా నెక్స్ట్ ఏంటి?

కాగా ఈ సినిమా రిజల్ట్ ను చూశాక నభా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది అంటూ ఆరా తీస్తున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం మేకర్స్ అందరి దృష్టి కేవలం కొత్త హీరోయిన్లపైనే ఉంది. ఈ నేపథ్యంలో నభా సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ తాను కూడా ఉన్నాను అని గుర్తు చేస్తోంది. మరి ఈ అమ్మడికి మరో ఛాన్స్ ఇచ్చే బాధ్యతను ఎవరు తీసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు