Malayalam Horror Movies : ఈరోజుల్లో మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లవ్ స్టోరీల దగ్గర్నుంచి మొదలు పెడితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, హారర్ సినిమాలకు కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో ఉన్న కొన్ని మాలీవుడ్ అండర్ రేటెడ్ హారర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోమాంచం
హారర్ కామెడీ సినిమాలు ఏ భాషలో ఉన్నా సరే ఓటీటీ లవర్స్ వదలకుండా చూస్తారు. ఇక ఇలాంటి హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మలయాళ సినిమానే రోమాంచం. జీతూ మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ రియల్ లైఫ్ స్టోరీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో షౌబిన్ షాహిర్, అర్జున్ అశోక్ ప్రధాన పాత్రలు పోషించారు. షౌబిన్ షాహిర్ గురించి మలయాళ మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా మంజుమ్మెల్ బాయ్స్ లో కూడా ఈ మలయాళ నటుడు నటించాడు. ఔజా అనే బోర్డ్ గేమ్ అనే హారర్ గేమ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
9
సైన్స్ ఫిక్షన్ అండ్ హారర్ జోనర్స్ రెండు ఓకే సినిమాలో ఉండడం చాలా కష్టమని చెప్పాలి. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన నైన్ మూవీ ఈ అరుదైన జానర్లోనే రూపొందింది. జెనుస్ మహమ్మద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, వామికా గబ్బి, మమతా మోహన్ దాస్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అవుతోంది.
భ్రమయుగం
1800 కాలం నాటి బ్యాక్ డ్రాప్ లఓ సాగే కథతో రాహుల్ సదశివన్ దర్శకత్వంలో రూపొందిన మూవీనే భ్రమయుగం. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తో పాటు సిద్ధార్థ్ భారతన్, అర్జున్ అశోక్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ లో అందుబాటులో ఉంది. అయితే సినిమాలో మాటలు ఉండవు. అలాగే కంప్లీట్ గా మూవీ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో సాగుతుంది.
భూతకాలం
భ్రమయుగం డైరెక్టర్ రాహుల్ సదాశివన్ భూతకాలం సినిమాకు కూడా దర్శకుడుగా వ్యవహరించారు. హారర్ సినిమాకు కొత్త అర్ధాన్ని తీసుకొచ్చిన ఈ మూవీలో షేన్ నిగమ్, రేవతి తల్లి కొడుకులుగా నటించారు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సోనీ లివ్ లో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
కినావల్లి
శ్యామ్ సీతల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013లో రిలీజ్ అయిన పి మార్క్ అనే థాయ్ హారర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ కినావల్లి మూవీ 2018లో థియేటర్లోకి వచ్చింది. ఈ మలయాళ ఫాంటసీ హారర్ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది.