OTT Movie : వెన్నులో వణుకు పుట్టించే అక్కా చెల్లెళ్ళ హార్రర్ స్టోరీ… ఓటిటిలో ఉందంటే?

OTT Movie : సైకలాజికల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల కోసం వెతికే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇందులో మర్డర్ మిస్టరీతో పాటు హారర్ వంటి ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ చివర్లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? టైటిల్ ఏంటి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ది అన్ ఇన్వైటెడ్. ఒకవేళ ఇంకా ఈ మూవీని చూడకపోతే హారర్ సస్పెన్స్ మూవీ లవర్స్ తప్పకుండా ఓ లుక్కెయ్యండి.

Just seen ,The Uninvited' (2009) (FULL REVIEW IN COMMENTS) : r/HorrorMovies

- Advertisement -

కథ ఏంటంటే…

సినిమాలో ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు. అయితే హీరోయిన్ బీచ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేద్దాం అని వెళ్తుంది. కానీ అతను అసభ్యకరంగా ప్రవర్తించడం ఆమెకు నచ్చదు. దీంతో  విషయాన్ని తన అక్కకు చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. ఈ క్రమంలో డెడ్ బాడీస్ ఉన్న మూడు సంచులు కనిపిస్తాయి హీరోయిన్ కి. ఇక ఇంకోవైపు ఈ అక్క చెల్లెలు ఇద్దరి తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె లేవలేని పరిస్థితిలో ఉండడంతో బెడ్ పైనే పడుకుని ఉండగా, ఆమె చేతికి ఒక గంట కూడా కట్టి ఉంటుంది.. ఇక హీరోయిన్ ఇంటికి వెళ్లే లోపే అక్కడ డోర్ నుంచి రక్తం కారుతూ కనిపిస్తుంది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఆ ఇల్లు పేలిపోతుంది. దీంతో ఊహించని ఈ పరిణామానికి హీరోయిన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది.

పదేళ్ల పాటు ఇదే సిచువేషన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి చూస్తే తన తండ్రి వేరే పెళ్లి చేసుకుని కనిపిస్తాడు. ఆ తర్వాత తన అక్క దగ్గరికి వెళుతుంది. ఈ క్రమంలోనే అక్కచెల్లెళ్ళు ఇద్దరి మధ్య తమ తల్లిని సవతి తల్లే చంపేసిందా అనే డిస్కషన్ వస్తుంది. ఆమెపై అనుమానం రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ తల్లి బెడ్ కు పరిమితమైనప్పుడు ఈ సవతి తల్లి కేర్ టేకర్ గా ఉండేది అన్నమాట. ఈ నేపథ్యంలోనే డెలివరీ బాయ్ అయిన హీరో ఎంట్రీ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరి గురించి తెలిసిన సవతి తల్లి ముఖం మీదే అతన్ని తన ఇంటికి రావద్దని చెప్పేస్తుంది. నెక్స్ట్ డే హీరో కూడా చనిపోతాడు. దీంతో సవతి తల్లి అతన్ని కూడా చంపేసిందని ఎవరికి చెప్పినా నమ్మరు. పైగా తండ్రి ఇలా మాట్లాడినందుకు వాళ్లను అసహ్యించుకుంటాడు. మరి ఇంతకీ హీరోయిన్ వాళ్ళ అమ్మను చంపింది ఎవరు? హీరోని ఎవరు చంపారు? ఆమె సవతి తల్లి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ ని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు