Ntr -prasanth Neel : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఆ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో కూడా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే న్యూస్ ఒకటి వినిపిస్తుంది..
ఎన్టీఆర్ దేవర, బాలీవుడ్ వార్ 2 సినిమాలు అయ్యాక నెక్స్ట్ మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో ఎన్టీఆర్ తన సినీ లైఫ్ లో ఎప్పుడూ చెయ్యని పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అటువంటి కొత్త పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారట.. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఇది విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఏంటయ్యా ప్రశాంత్ నీల్ మా ఎన్టీఆర్ ను ఏం చెయ్యాలనుకుంటున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక సినిమాలో ఓ పాత్రలో మాఫియా డాన్‌గా ఎన్టీఆర్ ను చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని సమాచారం..
ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అది చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.. డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. ఇక బాలీవుడ్ సినిమా వార్-2లోనూ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 చిత్రంలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ లైనప్‌లో తర్వాత ఉన్న మూవీనే డ్రాగన్. ఈ సినిమా షూటింగ్ కూడా రెండు నెలల్లో ప్రారంభం కాబోతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హీరోయిన్ ను దించబోతున్నారని టాక్.. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే..