Sneha.. ఈమధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు సినిమాలలో అవకాశాలు తగ్గిన తర్వాత సోషల్ మీడియాను వేదికగా చేసుకొని గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఆదాయ వనరుగా మారింది. అందులో భాగంగానే ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు. కొంతమంది యంగ్ బ్యూటీలు గ్లామర్ ఒలక బోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ.. వాటిని షేర్ చేస్తూ ఉంటే, మరి కొంత మంది సీనియర్ భామలు బాపు బొమ్మగా తయారయ్యి అందరిని ఆకట్టుకుంటున్నారు.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తూ ఫాలోవర్స్ ను ఇలా కూడా పెంచుకోవచ్చని నిరూపిస్తున్నారు. అలాంటి వారిలో స్నేహ కూడా ఒకరు.
చీర కట్టులో బాపు బొమ్మలా స్నేహ..
తాజాగా కుటుంబంతో సహా లండన్ వెకేషన్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించి అందరిని ఆకట్టుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి, గ్రీన్ కలర్ చీర కు చెక్స్ రెడ్ కలర్ పైతానీ బోర్డర్ కలిగిన చీర ధరించి అందరిని ఆకట్టుకుంది. ముసి ముసి నవ్వులతో సోయగాలు వలకబోస్తూ దేవకన్య దిగివచ్చిందా అనేంతల అందరిని ఆకట్టుకుంది స్నేహ. ప్రస్తుతం స్నేహకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కూడా బాపు బొమ్మ వచ్చిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె అందాల సోయగానికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
స్నేహా సినీ ప్రయాణం..
స్నేహ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో నటించి తెలుగు ఆడియన్స్ , తమిళ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందం, అభినయంతో కట్టుబొట్టుతో భారీ క్రేజ్ దక్కించుకుంది స్నేహ. ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర యాడ్స్ చేస్తూనే అప్పుడప్పుడు బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తూ ఉంటుంది.. అందుకే స్నేహకు అంతాడిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ తన అందంతో, నటనతో యువతను ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.
స్నేహకు తొలి అవకాశం..
ఇక స్నేహ కెరియర్ విషయానికి వస్తే..తండ్రి రాజారామ్ , తల్లి పద్మావతి. సోదరి సంగీత , సోదరులు బాలాజీ, గోవింద్ . ఈమె ముంబైలో జన్మించింది. ఆ తర్వాత ఈమె కుటుంబం మొత్తం దుబాయ్ కి వెళ్ళిపోయింది. అక్కడ ఈమెను మొదటిగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్.. ఈమెను ఇక్కడి దర్శకులకు రికమెండ్ చేసి ఆమెకు అవకాశం కల్పించేలా చేశారు. అలా మొదటగా 2000 సంవత్సరంలో ఎంగెనా ఒరు నీల పక్షి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు.
ప్రసన్నా తో ప్రేమ, పెళ్లి..
ఇక తర్వాత ప్రసన్నా తో అచ్చాముందు!అచ్చాముందు! సినిమా చేసింది. అదే సమయంలో వీరిద్దరిపై రూమర్లు షికారులు చేశాయి. పైగా స్నేహ పాల్గొన్న అన్ని మోడలింగ్ షోలలో ప్రసన్న పాల్గొన్నారు. ఇద్దరూ కలసి సినిమా ప్రివ్యూలలో కూడా కనిపించారు. కొంతకాలం పుకార్లను కొట్టివేసిన ఈ జంట 2011 నవంబర్ 9న వీరి బంధాన్ని ప్రకటించి, 2012 మే 11న వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు కూడా ఉన్నారు.
View this post on Instagram