Megastar Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరుకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే.. ఎటువంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆయనకు సలామ్ కొట్టే స్థాయికి ఎదిగాడు.. చిరు సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువ.. చిన్న పాత్రలలో నటిస్తూ సత్తా చాటాడు.. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను క్రేజ్ ను పెంచుకుంటూ ఇప్పుడు ఏకంగా మెగా సామ్రాజ్యన్ని ఏర్పాటు చేశాడు. తన తర్వాత ఎందరో హీరోలు మెగా ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే ఉన్నారు.. అయితే చిరంజీవికి మాత్రం అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని చాలా సందర్భాల్లో చెప్పాడు.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.. చెర్రీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వక ముందు అతను ఎలా నిలదొక్కుకుంటాడో అని చిరు చాలా భయపడినట్లు ఓ ఇంటర్వ్యూ లో చిరు చెప్పాడు. చిరు కుటుంబంలో ఎలాంటి ఈవెంట్ జరిగినా అల్లు అర్జున్ చాలా యాక్టివ్ గా చిరు పాటలకు డ్యాన్స్ అదరగొట్టేవాడట. దీంతో చిరంజీవి బన్నీని చూసి తెగ మరిచిపోయావాడట. రామ్ చరణ్ కు అసలు డ్యాన్స్ చేయడం రాదట.. అందుకే సినిమాలు అంటే డ్యాన్స్ కంపల్సరీ అని ఆ విషయం నాకు భాధ పెట్టేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. బన్నీని చూసి డ్యాన్స్ చేయడం నేర్చుకో అంటూ తిట్టేవారట. ఇక రాంచరణ్ తన మొదటి సినిమా చిరుతలో తన డ్యాన్స్ తో ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాడో తెలిసిందే.. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్, బన్నీ తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే..
ఇకపోతే చిరంజీవి ఫ్యామిలీ నుంచి అరడజనుకు పై హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. పవన్ కళ్యాణ్, నాగ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ ఇలా ఎంతోమంది హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక బన్నీ, చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం వీరిద్దరు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో పాటుగా మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.. బన్నీ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..