Raayan Movie Telugu Review : రాయన్ మూవీ రివ్యూ

Raayan Movie Telugu Review : సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో ధనుష్ ఒకరు. కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గా, రచయితగా, దర్శకుడుగా కూడా మంచి పేరును సాధించుకున్నాడు ధనుష్. ప్రతి ఒక్కరికి కూడా మైల్ స్టోన్ ఫిలిం అంటే ఒక రకమైన ప్రత్యేకత ఉంటుంది. ఏ దర్శకుడితో చేస్తే బాగుంటుంది. ఎటువంటి కాన్సెప్ట్ ఎంచుకుంటే వర్కౌట్ అవుతుంది. ఇలాంటి ఆలోచనలు రకరకాలుగా మొదలవుతాయి. ఇక ధనుష్ కెరియర్ లో 25వ సినిమాగా వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమాని ఎవరు మర్చిపోలేరు. ఇప్పుడు 50వ సినిమా వస్తుంది అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అంచనాలన్నిటిని సరైన స్థాయిలో నిలబెట్టే అవకాశాన్ని మరొక దర్శకుడికి ఇవ్వకుండా తన సినిమా తానే డైరెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్. మరి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఓ మారుమూల గ్రామంలో ఒక తల్లికి ముగ్గురు అబ్బాయిలు పుడతారు. నాలుగవ సంతానంగా ఒక ఆడపిల్ల పుడుతుంది. ఒకరోజు ఉదయం నలుగురు పిల్లలను జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఆ తల్లి భర్తతోపాటు బయటకు వెళుతుంది. ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు ఎప్పటికీ రాకపోయేసరికి, ఆ కుటుంబంతో బంధుత్వంగా ఉండే స్వామీజీని కలుస్తారు ఈ పిల్లలు. వీళ్ళలో ఆడపిల్లను స్వామీజీ అమ్మే ప్రయత్నం చేస్తాడు. అది తెలుసుకున్న పెద్దకొడుకు ఆ క్షణాన స్వామీజీని హత్య చేస్తాడు. అక్కడితో వాళ్ళ ఆలోచన తీరు మారిపోతుంది. ఆ తరువాత వాళ్ళు ఎలా పెరిగారు, అలా పెద్దవారయ్యారు.? పెద్దవారు అయిన తర్వాత జరిగే పరిణామాలేంటి.? ఆ ఊర్లో ఉన్న రెండు గ్యాంగ్స్ మధ్య వీళ్లు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు.? ఎటువంటి పరిణామాలు జరిగాయి అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ :

మామూలుగా కథ విషయానికి వస్తే ఇదేమి కొత్త కథ కాదు. మనందరం ఎప్పుడో చూసిన కథ, మనందరికీ చాలా బాగా తెలిసిన కథ. కానీ ఈ సినిమా ఎక్కడ సక్సెస్ అయ్యింది అంటే కథను చూపించిన విధానం. తన కెరీర్లో చాలామంది దర్శకులతో వర్క్ చేయడం వలన మంచి దర్శకత్వ ప్రతిభను పొందుకున్నాడు ధనుష్. ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అంత తేలికైన పని కాదు. ప్రతి విషయంపై ఒక క్షున్నమైన అవగాహన ఉండాలి. అది ఉంటే కానీ పేపర్ మీద ఉన్న కథను వెండితెర మీదకి తీసుకురాలేము. ఇక ధనుష్ విషయానికి వస్తే పేపర్ మీద 80% రాస్తే దానిని 99% స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.

- Advertisement -

మామూలుగా సినిమా చూస్తున్నంత సేపు టెక్నికల్ వైస్ ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ సినిమాకి ధనుష్ దర్శకత్వం వహించాడా.? లేకపోతే వేరే దర్శకుడు దర్శకత్వం చేస్తే ధనుష్ పేరు చేసుకున్నాడా అని అనిపించక మానదు. ఎందుకంటే స్క్రీన్ పై నటుడుగా పర్ఫామెన్స్ చేస్తూనే తన తోటి నటునటులను ఎట్ ద సేమ్ టైం మానిటర్ చేయటం అనేది మామూలు విషయం కాదు. కానీ దీనిని చాలా సక్సెస్ఫుల్గా అచీవ్ చేశాడు ధనుష్.

ఈ సినిమాలో నటించిన ఐదు పాత్రలకి అద్భుతమైన మీటర్ లో క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాడు. సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ , ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్ వీళ్ళందరికీ సినిమాల్లో మంచి ఇంపార్టెన్స్ ఉంది తమదైన శైలిలో అందరూ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఎంత బాగా వర్కౌట్ అయ్యాయో, సందీప్ కిషన్ అపర్ణ బాలమురళి మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా అలానే వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దర్శకుడు ధనుష్ ఆలోచనను సాధ్యమైనంత మేరకు వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాడు సినిమాటోగ్రాఫర్.

బేసిగ్గా సినిమా అంటే కథ స్క్రీన్ ప్లే మాటలు కాకుండా కంటికి కనిపించకుండా ఆ సినిమాపై ఒక ఫీల్ ని తీసుకొచ్చి క్రాఫ్ట్ ఒకటి ఉంటుంది. అది మ్యూజిక్. ఈ మ్యూజిక్ అనేది ఒక సినిమాకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ స్ట్రాంగెస్ట్ కం బ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి సీన్ లో ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీన్ ని మరికొంత ఎలివేట్ చేస్తుంది. అలానే ఈ సినిమాకి రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఛాన్స్ దొరికిన ప్రతి చోట తన టాలెంట్ మరోసారి చూపించాడు రెహమాన్.

ఈ సినిమాకి మైనస్ అంటూ ఏదైనా ఉంది అంటే సినిమా సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ ని డ్రాగ్ చేస్తూ ప్రిడిక్టబుల్ సీన్స్ ని రాశాడు ధనుష్. సెకండాఫ్ విషయంలో కొంత మేరకు జాగ్రత్త తీసుకొని ఉండి ఉంటే ధనుష్ కెరియర్లో బెస్ట్ డైరెక్షన్ ఫిలిం అయ్యేది. ఏదేమైనా ధనుష్ కెరియర్ లో వచ్చిన ఈ 50వ సినిమా, చాలామంది ధనుష్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కు కూడా విజువల్ ట్రీట్ లా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

ధనుష్ డైరెక్షన్
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
యాక్షన్ సీక్వెన్సెస్
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
సందీప్ కిషన్ అపర్ణ కెమిస్ట్రీ

మైనస్ పాయింట్స్ :

ల్యాగ్ సీన్స్
ప్రిడేక్టబుల్ సెకండాఫ్

మొత్తంగా: ప్యూర్ థియేటర్ కంటెంట్. వర్త్.. వాచ్ వర్మ

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు