Farah Khan: ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఇంట్లో విషాదం.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..!

Farah Khan.. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 79 సంవత్సరాల వయసున్న ఆమె తల్లి తాజాగా మరణించారు. ఫరా ఖాన్ తల్లి మేనక ఇరానీ 79 సంవత్సరాల వయసులో శుక్రవారం ముంబైలో తన నివాసంలో మరణించారు. మేనక ఎవరో కాదు హనీ ఇరానీ ,డైసీ ఇరానీలకు సోదరి కూడా.. అంతే కాదు 1963 లో సల్మాన్ ఖాన్ తండ్రి మరియు స్క్రిప్ట్ రైటర్ సలీంఖాన్ నటించిన బచ్ పన్ చిత్రంలో నటిగా కూడా నటించింది. ఆ తర్వాత ఈమె ఫిలిం మేకర్ కమ్రాన్ ఖాన్ ను వివాహం చేసుకుంది. నివేదికల ప్రకారం గత కొంతకాలంగా మేనక అనారోగ్యంతో బాధపడుతున్నారట.. ఇటీవల గత రెండు వారాల క్రితం 79వ పుట్టినరోజును కూడా ఆమె ఘనంగా జరుపుకున్నట్లు సమాచారం.

Farah Khan: Tragedy at the house of famous Bollywood choreographer.. Family members are in mourning..!
Farah Khan: Tragedy at the house of famous Bollywood choreographer.. Family members are in mourning..!

ఘనంగా తల్లి పుట్టిన రోజు..

అంతేకాదు తల్లి పుట్టిన రోజున ఫరా ఖాన్ కూడా ఆ విషయాలను పంచుకుంటూ ఫోటోలను షేర్ కూడా చేశారు.. మనమందరం మన తల్లులను ఎంతగానో ప్రేమిస్తాము.. ముఖ్యంగా నేను మా అమ్మ మేనకను చాలా ప్రేమిస్తున్నాను . ఇటీవలే ఈమె అనేక శస్త్ర చికిత్సల తర్వాత మళ్లీ మా ముందుకు వచ్చింది. అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇంటికి తిరిగి రావడానికి ఈరోజు చాలా మంచి రోజు.. నువ్వు మళ్ళీ నాతో గొడవ పడేంత బలాన్ని పొందే వరకు నేను వేచి ఉండలేను.. నేను ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మ.. అంటూ ఆమె పోస్ట్ చేసింది. అయితే ఇంతలోనే ఆమె తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఫరాఖాన్.

తల్లి కష్టాలపై సాజిద్ కామెంట్స్..

ఇకపోతే ఫరాఖాన్ సోదరుడు సాజిద్ ఖాన్ ఎప్పుడు కూడా తన తల్లి ఎదుర్కొన్న ఆర్థిక కష్టాల గురించి మీడియాతో చెప్పుకునే వారు.. ఎందుకంటే ఈయన తండ్రి కమ్రాన్ ఖాన్ మద్యపానం కారణంగా మరణించారు. ఆ తర్వాత పిల్లలను పెంచి పెద్ద చేసింది మేనక. పిల్లల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.. ఇదే విషయంపై ఫరా ఖాన్ సోదరుడు సాజిద్ వెల్లడిస్తూ మేము సినిమా కుటుంబానికి చెందిన వారిమే.. కానీ నాకు ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మేము చాలా పేదవాళ్ళము .మా డబ్బు అంతా పోగొట్టుకున్నాము. నాన్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో ఎన్నో కష్టాలు పడ్డాము .మమ్మల్ని ఆర్థికంగా బలం చేయడానికి తానుపడ్డ కష్టం వర్ణనాతీతం అంటూ తల్లి పుట్టిన రోజు సందర్భంగా షాజిద్ వెల్లడించారు.

- Advertisement -

తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫరా ఖాన్..

అయితే ఇప్పుడు ఇంత ప్రేమ పెంచుకున్న తమ తల్లి తమకు దూరం కావడంతో వీరిద్దరూ తట్టుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. అయితే మేనక మరణానికి గల కారణాన్ని మాత్రం ఇంకా తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు మేనక ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

ఫరా ఖాన్ కెరియర్..

ఇక ఫరా ఖాన్ విషయానికి వస్తే కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈమె దర్శకురాలిగా కూడా పలు చిత్రాలను నిర్మించింది. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో బిజీగా అవుతున్న నేపథ్యంలో ఇలా తల్లి మరణం ఆమెను మరింత వెనక్కు లాగిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు