5 Years For Dear Comrade : రష్మిక ఎమోషనల్ పోస్ట్.. పాత జ్ఞాపకాలు వెంటాడుతున్నాయ్ అంటూ..?

5 Years For Dear Comrade.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ అంతకుమించి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే ఛలో సినిమా తర్వాత నటించిన చిత్రం గీతాగోవిందం. ఇందులో ఈమెకు జోడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించి మంచి విజయం సాధించడమే కాదు ఈ జోడి కి సూపర్ హిట్ క్రేజ్ కూడా లభించింది. అంతేకాదు ఈ చిత్రంతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే రూమర్స్ కూడా వినిపించాయి.. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసిన నటించిన చిత్రం డియర్ కామ్రేడ్… సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ క్లాసిక్ ఫిలిం గా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా విడుదలై నేటికీ ఐదు సంవత్సరాలు. ఈ విజయాన్ని వారు మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. అందులో భాగంగానే రష్మిక మందన్న కూడా డియర్ కామ్రేడ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

5 Years For Dear Comrade : Rashmika's emotional post.. Haunting old memories..?
5 Years For Dear Comrade : Rashmika’s emotional post.. Haunting old memories..?

జ్ఞాపకాలన్నీ మళ్లీ గుర్తొస్తున్నాయి..

డియర్ కామ్రేడ్ మూవీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుండి క్రికెట్ శిక్షణ వరకు, నెలల తరబడి ఎన్నో జ్ఞాపకాలు.. ఎన్నో గాయాలు , నొప్పులు, షూటింగ్లలో నవ్వు , తృప్తి, కన్నీళ్లు , చెమట, అన్నీ కూడా నాకు జ్ఞాపకాలే ..ఈ సినిమా విడుదలయ్యి నేటికి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఈ జ్ఞాపకాలు నన్ను తడుముతూనే ఉన్నాయి. ఇక ఇన్ని చేసిన తర్వాత వీటన్నింటిని కలిపి కథగా తెరపై చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. దుఃఖాన్ని సైతం ఆనందంగా మార్చింది .డియర్ కామ్రేడ్ ను మాకు ఎప్పటికీ మరిచిపోలేని ఒక జ్ఞాపకంగా మిగిల్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది రష్మిక మందన్న . అంతే కాదు డియర్ కామ్రేడ్ లోని ఒక వీడియో సాంగ్ ను కూడా ఆమె పంచుకుంది.

ఇప్పటికీ లిల్లీ అనే పిలుస్తున్నారు..

అంతేకాదు ఈ సినిమా తర్వాత ఇప్పటికీ నన్ను చాలామంది లిల్లీ అని పిలుస్తున్నారు. ఈ పదం నాకు చాలా ప్రత్యేకమైనది. డియర్ కామ్రేడ్ సినిమా విద్యార్థి రాజకీయ నాయకుడి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. అతడు కోపంతో ఊగిపోయే సమయంలో లిల్లీ అతడిని కలుస్తుంది.. లిల్లీతో కథ మొత్తం మారుతుంది. పరిస్థితులు మారిపోతాయి అలా సినిమా మొత్తం కూడా చాలా అద్భుతంగానే ఉంది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఈ సినిమా అప్పుడు డిజాస్టర్ గా నిలిచినా ఇప్పుడు మాత్రం క్లాసిక్ గానే ఆకట్టుకుంటుంది ..ఏది ఏమైనా ఈ సినిమా ఇప్పుడు ఇలా అనిపించడానికి కారణం రష్మిక, విజయ్ ల కాంబినేషన్ అనే చెప్పాలి. ఏది ఏమైనా వీరిద్దరి మధ్య రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ కూడా తెరపై వీరిద్దరి కాంబినేషన్ పీక్స్ అని చెప్పడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు