Committee Kurrollu trailer: కమిటీ కుర్రాళ్ళు గెలిచేలా ఉన్నారు

Committee Kurrollu trailer: ఈ హడావిడి ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరిగినా కూడా ప్రతి మనిషికి కొన్ని అనుభవాలు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎక్కడి నుంచి వచ్చాం అనేది మాత్రం ఖచ్చితంగా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. ఇంకొంతమంది గుర్తు చేస్తూ ఉంటారు. అలానే గుర్తు చేసే వాటిలో కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఇంకొన్ని సినిమాలు ఉంటాయి. సినిమాలు విషయానికి వస్తే చాలా సినిమాలు మనకి నోస్టాల్జియా ఫీల్ ని తీసుకొస్తాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు 90 స్ మంచి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చాయి.

ఇక రీసెంట్ టైమ్స్ లో అలా కొంతమందిని ఆకట్టుకునే సినిమా ఏదైనా వస్తుందంటే ఆ సినిమా పేరు కమిటీ కుర్రాళ్ళు. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని “ఆ రోజులు మళ్లీ రావు ఈ రోజుల్లో కానే కావు” అనే పాట విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమా టీజర్ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. చాలామందిని తమ బాల్యపు జ్ఞాపకాల్లోకి ఈ టీజర్ తీసుకెళ్ళింది. చాలామందికి తమ గతాన్ని గుర్తు చేసింది. ఇటువంటి సినిమాలకు ఎప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది.

ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ ఈవెంట్ కు సిద్దు జొన్నలగడ్డ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే చాలా అంశాలను ట్రైలర్ చూపించారు. ముందుగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ లో జ్ఞాపకాలను అనుభవాలను గుర్తు చేస్తే, ఇప్పుడు ట్రైలర్ లో మాత్రం సినిమా కథాంశాన్ని చిన్నగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ కలిసి ఆడుకొనే ఫ్రెండ్స్ మధ్య ఎటువంటి ఇబ్బందులు తలెత్తాయి. వీటి మధ్య రాజకీయ నాయకులు ఒత్తిడి ఎంతవరకు ఉంది, వీరి మధ్య చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఏమిటి, అనే అంశాలు కూడా ఈ సినిమాలో చూపిస్తారు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ప్రొడక్షన్స్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు