Salaar: ప్రముఖ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి చిన్నారులు, మహిళలపై జరిగే అఘాయిత్యాలపై సోషల్ మీడియా వేదికగా తన వంతు పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా గతంలో లైంగిక బాధితురాలుగా మీటూ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఈమె తనలాంటి మహిళల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వైరముత్తు లాంటి తమిళ దిగ్గజ నటులను కూడా ఈమె వదిలిపెట్టలేదు.తాజాగా ఇప్పుడు సలార్ నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని చిన్మయి ఆరోపించింది. గత కొద్ది రోజుల క్రితం ఇంటర్వ్యూకి వెళ్లిన ఒక మహిళ జర్నలిస్ట్ తో ఇతడు అసభ్యంగా ప్రవర్తించాడని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇతడి విచిత్ర ప్రవర్తన పై ఇతర మహిళలు కూడా తనతో చెప్పారని సింగర్ తెలిపింది. అంతే కాదు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. పబ్ , రెస్టారెంట్, పని ప్రదేశాలలో మహిళల పట్ల అసభ్యకరంగా జాన్ విజయ్ ప్రవర్తిస్తున్నాడని అందులో ఆమె స్పష్టం చేసింది.
జాన్ విజయ్ అమ్మాయిలతో అసభ్యకర ప్రవర్తన..
ప్రస్తుతం ఈ విషయాలన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరొకసారి గొంతు విప్పింది చిన్మయి. విజయ్ కూడా డిఎంకే కి చెందిన వ్యక్తి. అటు వైరముత్తూ ఇతడు ఒకే రకానికి చెందినవారు. అంటూ రకరకాల కామెంట్లు చేసింది చిన్మయి. అయితే ఇప్పుడు తాజాగా చిన్మయి పోస్ట్ కి బాధిత మహిళలు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇతగాడు పబ్బులు , క్లబ్బుల్లో చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు . సెలబ్రిటీ అన్న పొగరు చూపిస్తాడు. ముఖ్యంగా అమ్మాయిలతో అమర్యాదగానే ప్రవర్తిస్తాడు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గతం నుంచి జాన్ విజయ్ పై ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఆధారాలతో సహా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది సింగర్ చిన్మయి.. ప్రస్తుతం సింగర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
జాన్ విజయ్ సినిమాలు..
జాన్ విజయ్ ప్రస్తుతం తెలుగు , తమిళ్ భాషలలో నటిస్తున్నాడు. విలన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే తమిళనాడు అక్కడ ఓరం పో , సర్పట్ట పరంబరై, సలార్ – పార్ట్ వన్ సీజ్ ఫైర్ లాంటి చిత్రాలలో జాన్ విజయ్ నటించారు. ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో రంగా పాత్రలో ఈయన కనిపించిన విషయం తెలిసిందే. అలాగే గత ఏడాది చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా జాన్ విజయ్ కీలక పాత్ర పోషించాడు.. ముఖ్యంగా విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జాన్ నిజ జీవితంలో కూడా విలన్ గానే ప్రవర్తిస్తున్నాడని సింగర్ చిన్మయి చెప్పకనే చెప్పేసింది. ఏది ఏమైనా ఇతర మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం నిజంగా ఆగ్రహాన్ని తెప్పించే అంశం అని చెప్పాలి. మరి ఈయనపై ఏ మేరకు సినీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
After The Newsminute report about the Sexual Assault case of Malayalam cinema also mentioned John Vijay for his misdemeanour with the journalist
There are other women speaking about his behaviour in general. pic.twitter.com/AfeLgdC0lY
— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024