Manchu Vishnu : మేం బ్లాక్ మెయిల్ చేయడం లేదు… అదంతా ఫేక్… వారిపై చర్యలు తప్పవు

Manchu Vishnu : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాను ఉపయోగించి చాలామంది పాపులర్ అయ్యారు. కొంతమంది సెటిల్ అయిపోయి సినిమాలు కూడా తీసే స్థాయికి వచ్చారు. సోషల్ మీడియా వాడడంతో కొంతమంది కెరియర్ లో ముందుకు వెళ్తుంటే ఇంకొంతమంది జైలు పాలవుతున్నారు. రీసెంట్ గా ప్రణీత్ హనుమంతు అనే యుట్యూబర్ ఎంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే సినిమాలను ట్రోల్ చేయడం మాత్రమే కాకుండా ఒక తండ్రి కూతురు మధ్య రీల్ కూడా ట్రోల్ చేసి అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రణీత్ ను శిక్షించారు.

ఇకపోతే రీసెంట్ గా చాలా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా సినిమాలను ట్రోల్ చేయడం మొదలుపెట్టాయి. ఈ ట్రోలింగ్ ఛానల్స్ అన్నీ కూడా మాక్సిమం మంచు ఫ్యామిలీ పై ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. దీనికి కారణం లేకపోలేదు, ఎందుకంటే స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మేము గొప్ప మేము గొప్ప అంటూ వీళ్ళు చెబుతూ ఉంటారు. ఈ వీడియోస్ చూసి చాలామంది ఆ క్లిప్స్ ని కట్ చేసి మీమ్స్ అటాచ్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటారు.

Manchu Vishnu's Kannappa

- Advertisement -

ఇకపోతే అలా సినిమాలను ట్రోల్ చేసి చాలా చానల్స్ ను బ్యాన్ చేసింది మా మూవీస్ అసోసియేషన్. అయితే దీనికి ఒక యూట్యూబర్ స్పందిస్తూ మంచి ఫ్యామిలీని ట్రోల్ చేసే చానల్స్ మాత్రమే బ్యాన్ చేశారు అంటూ ఒక వీడియో చేశాడు. అంతేకాకుండా ఈ చానల్స్ కోసం మళ్లీ రిక్వెస్ట్ పెడితే కన్నప్ప అనే సినిమా గురించి ఒక పాజిటివ్ వీడియో చేస్తే గాని వీటిని యాక్టివ్ చేయమంటూ మెయిల్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో పై మంచు విష్ణు స్పందించారు. తమ సంస్థ పేరిట వస్తున్న ఈ-మెయిల్స్ తప్పు అని, మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ క్లారిటీ ఇచ్చింది. కొందరు అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని, ఆ సమాచారాన్ని నమ్మొద్దని ఓ ప్రకటనలో కోరింది. ‘మా అధికారి ఈ-మెయిల్ ఐడీ info@24framesfactory.com నుంచి కాకుండా దేని నుంచి మెయిల్స్ వచ్చినా నమ్మొద్దు. ఇలా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు