Double Ismart : సినిమాలు ఫెయిల్ అయిన పూరికి ఫరక్ పడలేదు

Double Ismart : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమాను అతి త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొద్దాం అనుకునే దర్శకుడు లేడు. ఏమైనా అంటే నిదానమే ప్రధానము అంటూ కొన్ని సామెతలు చెబుతూ నెట్టుకొస్తుంటారు. కానీ అప్పట్లో ఒకడుండేవాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆ దర్శకుడు కూడా స్లో అయిపోయాడు. అతను మరెవరో కాదు పూరి జగన్నాథ్. ఏ హీరోతో సినిమా చేయాలి అని అనుకున్నా సరిగ్గా వారం రోజుల కూర్చుని కథ రెడీ చేసి, మరో వారం రోజులు కూర్చుని డైలాగులు పూర్తి చేస్తాడు. ఇక షూటింగ్ మొదలుపెట్టినప్పుడే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాడు. కానీ ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు పూరి కూడా నత్తనడక మొదలుపెట్టాడు.

ఇకపోతే పూరి హిట్ సినిమా చూసి చాలా రోజులైంది, కాదు కాదు సంవత్సరాలు అయింది. రామ్ పోతినేని హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మినహాయిస్తే పూరీ జగన్నాథ్ కెరీర్ లో ఈ మధ్యకాలంలో హిట్ సినిమా లేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు పూరి ఇంటి ముందుకు వచ్చి ధర్నాకు దిగే పరిస్థితి కూడా వచ్చింది. వీళ్ళందర్నీ ఉద్దేశిస్తూ పూరి అప్పట్లో మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే.

Double iSmart

- Advertisement -

ఇన్ని అవాంతరాల మధ్య కూడా పూరి డబుల్ ఇస్మార్ట్ అనే ఒక సినిమాను చేశాడు. మరో 20 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడంతో దానికి సీక్వెల్ అని దీనిని అనౌన్స్ చేయడంతో ఈ సినిమా మీద కొంచెం బజ్ ఉంది. కానీ వాస్తవానికి రామ్ పోతినేని కు కూడా రీసెంట్ టైమ్స్ లో హిట్ సినిమాలు లేవు. రామ్ చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. ఈ తరుణంలో చాలామంది వీళ్ళ సినిమాలకు ఏం మార్కెట్ ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమా మార్కెట్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే దాదాపు 60 కోట్ల వరకు ఈ సినిమాకి సంబంధించి మార్కెట్ జరిగినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమా సేఫ్ జోన్ కి వస్తేనే పూరి నుంచి మళ్లీ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే పాతాళానికి మించిన లోతు ఇంకా ఏదైనా ఉంటే అందులో కూరుకు పోయాడు అని చెప్పేయొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు