Pawan Kalyan.. తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ కూడా వివాదాలలో చిక్కుకుంటూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.. ముఖ్యంగా మెగా కుటుంబం అంటే చాలు చిర్రెత్తిపోతూ ఉంటుంది శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల కామెంట్లతో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ప్రముఖ సెలబ్రెటీలు, రాజకీయనేతల పైన కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది ముఖ్యంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడే ఈమె.. అటు వైసిపి అధినేత జగన్ ను ఎవరైనా విమర్శిస్తే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెబుతూ ఉంటుంది.
రాష్ట్ర మంత్రులతో శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..
గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన విషయం తెలిసిందే . సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ , ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పైన కూడా సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి దీంతో ఈమె పైన పోలీస్ కేసు కూడా నమోదయింది. ఇలాంటి సమయంలో కూడా నటి శ్రీరెడ్డి ఏమాత్రం వెనకడుగు వేయకుండా ట్విట్టర్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ఒక వీడియోను షేర్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోని సైతం ఈమె ఎడిట్ చేసి విడుదల చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా శ్రీ రెడ్డి పైన మరొక సారి ఫైర్ అవుతూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ పై అలాంటి వీడియో..
అసలు విషయంలోకి వెళ్తే ఈ వీడియోలో.. గతంలో పవన్ కళ్యాణ్ నాడు నేడు, అమ్మఒడి , దీవెనలు, కానుకలు అంటూ ఇలా ఎన్నో పథకాల పేర్లు నోటికొచ్చినట్టు ఆయన పెట్టుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి వీడియోని.. అలాగే మామ వస్తున్నాడు అంటూ చెప్పండి, పలక బలపం పట్టుకొని అ ఆ ఇ ఈ లు రాయిస్తే సరిపోతుందా అంటూ గతంలో చెప్పిన కొన్ని మాటలకు సంబంధించి వీడియో అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా మేము ఆపివేయం కచ్చితంగా మళ్ళీ ఆ పథకాలను కొనసాగిస్తామని చెప్పేటట్టుగా ఈ వీడియోని చూపించింది. అలాగే ఏపీ ప్రజలకు ఒక పది రూపాయలు ఎక్కువగానే ఇవ్వాలనుకుంటాము తప్ప తక్కువ చేయమని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లుగా చూపించింది.
పవన్ కళ్యాణ్ ను వెర్రిపప్పని చేసిందంటూ కామెంట్స్..
ఇలా రెండు వీడియోలను సైతం ఎడిట్ చేసిన శ్రీరెడ్డి చివరిగా జఫ్ఫా, సిగ్గులేని వెధవ అనేటువంటి ఎమోజీలను సైతం వీడియో చివరన యాడ్ చేసి విడుదల చేసింది. అలాగే చివరిలో పవన్ కళ్యాణ్ కింద కూర్చొని ఏడ్చే ఒక సన్నివేశాన్ని కూడా ఈ వీడియోకి జోడించడం జరిగింది శ్రీరెడ్డి.. అయితే దీంతో కొంతమంది శ్రీరెడ్డికి సపోర్టు చేస్తూ ఉండగా మరి కొంతమంది ఆమెను విమర్శిస్తూ ఉన్నారు.. ఏది ఏమైనా చివరికి శ్రీరెడ్డి పెట్టిన వీడియో అందరిని వెర్రి పప్పలను చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఈ వీడియోని విడుదల చేసిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
— Sri Reddy (@SriReddyTalks) July 26, 2024