Mokshagna Nandamuri : మొదటి అడుగే… నందమూరి వంశం అంటే ఇంతే ఉంటది మరి

Mokshagna Nandamuri : ఏ పరిశ్రమలోనైనా వారసత్వం అనేది ఉంటుంది. కాకపోతే ఫిలిం ఇండస్ట్రీ చాలామందికి కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ క్యూరియాసిటీ ఇండస్ట్రీ పీపుల్ పైన ఉంటుంది. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదుగుతున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ సీనియర్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిలో వెంకటేష్, బాలకృష్ణ మినహాయిస్తే మిగతా హీరోలు కొడుకులు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేసారు. ఇక మెగాస్టార్ తనయుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.

చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన రెండవ సినిమా మగధీరతోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ను సాధించాడు. అక్కడితోనే స్టార్ గా ఎదిగాడు. వెంటనే బాలీవుడ్ లో సినిమా కూడా చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం చరణ్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే టైంలోనే నాగర్జున తనయుడు నాగచైతన్య కూడా జోష్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేదు. ఆ తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ఏం మాయ చేసావే సినిమా నాగచైతన్యను హీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం చైతన్య కూడా వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు.

Nandamuri Mokshagna

- Advertisement -

ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీ కి మధ్య ఫ్యాన్ వార్స్ ఎలా జరుగుతుండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి ఫ్యామిలీ హీరోస్ ని కలిపి రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించిన కూడా ఆ సినిమాలో అసలైన హీరో మావాడు అంటే మావాడు అంటూ ఇప్పటికీ డిబేట్స్ చేసుకుంటారు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మైథాలజికల్ జోనెర్ లో ఉండబోతుంది. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని కథను సిద్ధం చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతోనే ఎంట్రీ ఇస్తున్నాడు మోక్షజ్ఞ. ఇకపోతే నందమూరి ఫ్యామిలీ ఎప్పటినుంచో పౌరాణిక సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక మోక్షజ్ఞ తొలి అడుగులోనే అటువంటి ప్రయత్నం చేయడం సేఫ్ జోన్ అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు