Mr Bachchan : మిస్టర్ బచ్చన్ స్టోరీ లీక్… రవితేజ పాత్ర ఇదే

Mr Bachchan : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన ఆశలన్నీ మిస్టర్ బచ్చన్ మూవీపైనే పెట్టుకున్నాడు. గత రెండేళ్ల నుంచి తన రేంజ్ కు తగ్గ హిట్ అందుకోలేక పోయిన రవితేజ వరుసగా మూడు డిజాస్టర్లను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మిస్టర్ బచ్చన్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మిస్టర్ బచ్చన్ మూవీ స్టోరీ లీక్ అయ్యింది. ఇందులో రవితేజ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడో కూడా బయటకు వచ్చింది.

మిస్టర్ బచ్చన్ స్టోరీ లీక్…

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ మిస్టర్ బచ్చన్. మిరపకాయ్ తర్వాత రవితేజ, హరీష్ కాంబోలో వస్తున్న రెండవ మూవీ ఇది. ఇక బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ కు వీరాభిమాని అయిన రవితేజ ఆయన పేరుతోనే ఈ సినిమాను చేస్తుండడంతో మిస్టర్ బచ్చన్ పై హైప్ మరింతగా పెరిగింది. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు విలన్ గా కనిపించబోతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ లో రవితేజ ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు అనే విషయం లీక్ అయ్యింది.

1980 బ్యాక్ డ్రాప్ లో మిస్టర్ బచ్చన్ మూవీ తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా అదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. రవితేజ ఇందులో వింటేజ్ లుక్ తో అదరగొట్టబోతున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం మిస్టర్ బచ్చన్ లో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీతో రవితేజ తన అభిమానులకు కిక్ ఇవ్వడం పక్కా అంటున్నారు నెటిజెన్లు. మిస్టర్ బచ్చన్ మూవీని ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

- Advertisement -

Mr Bachchan team wishes Raviteja Happy Birthday with striking poster

మిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్

ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల మధ్య నడుస్తున్న బాక్స్ ఆఫీస్ పోరు గురించే చర్చ సాగుతోంది. ఆగస్ట్ 15న రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఆ మూవీ నిర్మాత పూరి ముందుగానే ప్రకటించారు. అయితే ఊహించని విధంగా మిస్టర్ బచ్చన్ కూడా అదే డేట్ ను లాక్ చేయడంతో ఇండిపెండెన్స్ డే రోజు ఈ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీసు క్లాష్ జరగబోతోంది. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ స్వయంగా రవితేజ సినిమాను వాయిదా వేయమని అడిగారని, కానీ అందుకాయన ఒప్పుకోకపోవడంతో పూరి గుర్రుగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సమయం పూరీ, రవితేజకు మాత్రమే కాదు రామ్ పోతినేనికి కూడా ముఖ్యమే. మరి ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు