Rayaan: రాయన్ సినిమా సీక్వెల్ ని కన్ఫామ్ చేసిన టెక్నీషియన్

Rayaan: రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి సినిమాకు సీక్వెల్ తీయడం మొదలుపెట్టాడో కానీ అప్పటినుంచి చాలామంది దర్శకులు సీక్వెల్స్ తీయడం మొదలుపెట్టారు. ఈ సీక్వెల్స్ పద్ధతి అనేది అప్పట్లో కూడా ఉండేది. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో ప్రతి భారీ ప్రాజెక్టు కూడా ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధమవుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలలో పుష్ప సినిమా ఒకటి. ఇకపోతే ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా అని ప్రస్తుతం నిర్మిస్తున్నారు.

ఇక కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చి సంచలనం సృష్టించిన సినిమా కేజిఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది కే జి ఎఫ్ సినిమా. అయితే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఈ సినిమాకి సీక్వల్ గా కే జి ఎఫ్ టు అనే సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని అంటే అందరికీ ఒక రకమైన అంచనాలు ఏర్పడతాయి.

Raayan

- Advertisement -

ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కూడా పార్ట్ ఉండబోతుంది అని రిలీజ్ అవ్వకముందే అనౌన్స్ చేశారు. ఇలా అనిమల్, కల్కి, హనుమాన్ ఈ సినిమాలన్నిటికీ కూడా సీక్వెల్స్ రెడీ చేస్తున్నారు. ఇక రీసెంట్గా ధనుష్ దర్శకత్వంలో వచ్చిన రాయన్ సినిమా కూడా సీక్వెల్ ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్. రీసెంట్ గా ఒక తమిళ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ దగ్గర చాలా కథలు ఉన్నాయి, అలానే రాయన్ సినిమాకు కూడా సీక్వెల్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటూ చెప్పాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు