OTT Movie : పడుకున్నారో దెయ్యం పడుతుంది… ఓటిటిని వణికిస్తున్న హార్రర్ మూవీ

OTT Movie : ఓటీటీలో హారర్ మూవీస్ కు స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చి హారర్ మూవీ లవర్స్ ను భయపెడుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ట్రెండీగా మారిన కొరియన్ సినిమాలలోని బెస్ట్ హారర్ మూవీ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మంచి విషయం ఏమిటంటే ఈ కొరియన్ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

హారర్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో సినిమాలను చూసాం మనం. కానీ ఈ మూవీ మాత్రం వాటన్నింటి కంటే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. సాధారణంగా హారర్ సినిమాలు అంటే దయ్యాలు, భూతాలు, ఆత్మలు అంటూ భయపెడతారు మేకర్స్. అయితే ఈ సినిమాలో మాత్రం డైరెక్టర్ దయ్యాలు చూపించకుండానే ఓ డిజార్డర్ తో హీరో బాధపడే కథతోనే ప్రేక్షకులకు మంచి హారర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాడు. కంటెంట్ ఉంటే ఏదైనా సాధ్యమేనని ఈ సినిమా ద్వారా చేసి చూపించాడు. అంతేకాకుండా ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే ఓ మహిళ తన కుటుంబానికి ప్రాబ్లం వస్తే కాపాడుకోవడానికి ఎంత రిస్క్ తీసుకుంది అని అంశాన్ని కూడా ఇందులో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక క్లైమాక్స్ అయితే చూసే వరకు ఊహించలేరు. ఈ మూవీ పేరు స్లీప్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Sleep (2023) - IMDb

- Advertisement -

కథలోకి వెళ్తే…

ముందుగా సినిమాలో హ్యాపీగా ఉండే భార్యాభర్తలను చూపిస్తారు. ఇక ఈ చిన్న ఫ్యామిలీలోకి న్యూ బార్న్ బేబీ రాబోతుందన్న గుడ్ న్యూస్ తెలుస్తుంది ఆ భార్యాభర్తలకు. ఇంకేముంది ఇద్దరూ ఆ వార్తతో మరింత సంతోషంగా ఉంటారు. అయితే హీరోకి మాత్రం ఈ సినిమాలో ఓ విచిత్రమైన డిజార్డర్ ఉంటుంది. సాధారణంగా నిద్రలో నడిచే వాళ్లను మనం ఇప్పటిదాకా చూసాము. అయితే వాళ్ళు కేవలం నిద్రలో నడుచుకుంటూ వెళతారు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో పడుకున్నాడు అంటే చాలు అతనేం చేస్తాడో అతనికే తెలియదు. నిద్రపోయాక అతను చేసే వెరైటీ పనులన్నీ భయంకరంగా ఉంటాయి. ఆ వ్యక్తి వింత పనులు చూస్తే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కొన్ని సందర్భాలలో హీరోయిన్ కూడా జడుసుకుంటుంది. ఎంతగా ట్రై చేసిన ఆ అలవాటును మార్చలేక పోతుంది. ఇక రాను రానూ హీరో ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఒకానొక సమయంలో అతను చేసిన పనికి బెడ్ రక్తంతో తడిచిపోతుంది. మరి ఇంతకీ హీరో ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి ? దెయ్యం ఆయనతో ఇలాంటి పనులన్నీ చేయిస్తోందా ? అసలు భర్తను కాపాడడానికి హీరోయిన్ ఏం చేసింది ? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమాను వీక్షించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు