Harish Shankar Vs Puri Jagannadh: షాక్ సినిమా తర్వాత హరీష్ కి అవకాశం ఇస్తే, ఇప్పుడు పూరికి హరీష్ ఏం చేశాడో తెలుసా.?

Harish Shankar Vs Puri Jagannadh: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. ఇప్పట్లో కొందరు షార్ట్ ఫిలిమ్స్ తీసి దర్శకులుగా మారుతున్నారు. కానీ ఒకప్పుడు దర్శకుడు అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒక కథను నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడం కూడా మామూలు విషయం కాదు. ఇకపోతే హరీష్ శంకర్ విషయానికి వస్తే షాక్ అనే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. మొదటి సినిమా ఆడకపోతే రెండవ సినిమా పట్టుకోవడానికి ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడాలి. అలానే చాలా కష్టాలు పడ్డాడు హరీష్.

ఒక సినిమాకి దర్శకుడుగా పని చేసిన తర్వాత మరొక సినిమాకి పనిచేయడానికి అంతగా ఎవరూ ఇష్టపడరు. కానీ హరీష్ శంకర్ మాత్రం పూరి జగన్నాథ్ దగ్గర బుజ్జిగాడు చిరుత సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఎట్టకేలకు మళ్లీ మిరపకాయ్ సినిమాతో దర్శకుడుగా నిరూపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత హరీష్ కి పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా పడింది. ఆ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో హరీష్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అక్కడితో హరీష్ శంకర్ మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

Harish Shankar

- Advertisement -

ఇకపోతే ఏదేమైనా కూడా హరీష్ శంకర్ కి పూరి జగన్నాథ్ అంటే ఒక రకమైన గౌరవం ఉంది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక రీసెంట్ గా హరీష్ కి పూరి జగన్నాథ్ కి మధ్య వివాదం మొదలైంది అంటూ కొంతమంది పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇంతకు అసలు మేటర్ ఏంటంటే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

ఆ సినిమాతో పాటుగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. అయితే మిస్టర్ బచ్చన్ సినిమాను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయమని పూరీ టీం చెప్పిన కూడా హరీష్ వినలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై కొందరు స్పందిస్తూ షాక్ సినిమా తర్వాత అవకాశం ఇచ్చిన కూడా అది గుర్తుపెట్టుకోవట్లేదు హరీష్ అంటూ కొంతమంది అనడం మొదలుపెట్టారు. ఏదేమైనా ఆగస్టు 15న రిలీజ్ అయ్యి రెండు సినిమాలు ఆడితే ఇద్దరు దర్శకులు సక్సెస్ అయినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు