Kalki2898AD : రికార్డ్ అంటే ఇలా ఉండాలి.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ ని దాటేసింది..

Kalki2898AD : టాలీవుడ్ లో ఐదు వారాల కింద రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి2898AD సినిమా రోజుకో రికార్డు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా మైథలాజికల్ ఫిక్షన్ టచ్ తో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా థియేటర్లలో విడుదలై భారీ భీభత్సం సృష్టిస్తుంది. నిజానికి సమ్మర్ లో రావాల్సిన కల్కి వాయిదాలు పడుతూ అన్ సీజన్లో ఈ సినిమా రిలీజ్ కాగా, ప్రీమియర్స్ నుండే యానానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కల్కి సినిమా భారీ ఓపెనింగ్స్ తో దుమ్ములేపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది కల్కి. రెబల్ స్టార్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ల స్టార్ డమ్ కల్కి ఓపెనింగ్స్ కి మంచి హెల్ప్ అయిందని చెప్పాలి. ఇప్పటికే వెయ్యి కోట్ల మార్క్ ని దాటేసిన ఈ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డు ని అందుకుంది.

Kalki2898AD movie broke Baahubali 2 records in Nepal

ఏకంగా ఇండస్ట్రీ హిట్ ని లేపేసింది.. ఎక్కడంటే?

ఇక కల్కి సినిమా రిలీజ్ అయి ఐదు వారాలైనా ఇప్పటికి లిమిటెడ్ కలెక్షన్స్ తో స్ట్రాంగ్ హోల్డ్ ని చూపిస్తూ, దుమ్ములేపుతుండగా, లేటెస్ట్ గా ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయిన బాహుబలి2 రికార్డు ని కూడా బ్రేక్ చేసేసింది కల్కి సినిమా. అవును.. అయితే అది ఇక్కడ కాదు. నేపాల్ లో. అవును.. చిన్న దేశమైన నేపాల్ లో ఏకంగా బాహుబలి2 కలెక్షన్స్ ని బ్రేక్ చేసి కల్కి టాప్ లో నిలిచింది. ఇంతకు ముందు బాహుబలి2 అక్కడ 23 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని నేపాల్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇప్పుడు విడుదలైన ఏ పాన్ ఇండియా సినిమా కూడా దాన్ని అందుకోలేకపోయింది. RRR బ్రేక్ చేస్తుంది అనుకున్నా కుదరలేదు. కానీ కల్కి మూవీ 5వ వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో స్టడీ కలెక్షన్స్ ని సాధిస్తూ అక్కడ 23 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి, బాహుబలి2 ని బ్రేక్ చేసేసింది.

- Advertisement -

మరో వంద కోట్లు వచ్చే అవకాశం…

ఇక కల్కి (Kalki2898AD) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే ఆఫీషియల్ గా 1100 కోట్ల గ్రాస్ ని దాటిందని కల్కి మేకర్స్ ప్రకటించారు. అయితే ఆగష్టు 15 వరకు ఆశించిన క్రేజీ సినిమాలు థియేటర్లలో లేకపోవడంతో అప్పటివరకు కల్కి భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో ఇతర భాషల్లో కూడా పెద్దగా అడ్డు లేకపోతే దాదాపు మరో వంద కోట్లు వసూలు చేసే అవకాశం ఉండగా, త్వరలో జపాన్ లో కూడా విడుదలవుతుండగా ఖచ్చితంగా కల్కి 1200 కోట్ల మార్క్ ని దాటుతుందని అనిపిస్తుంది. ఇక ప్రభాస్ తన తదుపరి సినిమాలు చేస్తూ ప్రస్తుతం రాజా సాబ్ ని సెట్స్ పై ఉంచగా, కల్కి రెండో పార్ట్ మరో రెండేళ్ల తర్వాత రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు