SaripodhaaSanivaaram : రేంజ్ పెరిగింది… స్టార్ కాస్ట్ ఏకంగా ఇంతమందా?

SaripodhaaSanivaaram : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో ‘సరిపోదా శనివారం’ కూడా ఒకటి. నాని కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంటే సుందరానికి తర్వాత నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో స్కై లెవెల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయినా, రిలీజ్ తర్వాత క్లాసిక్ గా నిలిచింది. టాలీవుడ్ లో అండర్రేటెడ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా సరిపోదా శనివారం సినిమా నిలిచింది. ఇదిలా ఉండగా ‘స‌రిపోదా శ‌నివారం’ సినిమా రీసెంట్ గానే షూటింగ్ కూడా ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా నుంచి వ‌రుస అప్డేట్స్ తో చిత్ర యూనిట్ సినిమాపై హైప్ పెంచేస్తుంది.

Saripodhaa Sanivaaram movie star cast list

భారీ తారాగణంతో సరిపోదా శనివారం..

ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో భారీ తారాగణం నటిస్తుండడం విశేషం. బాలీవుడ్ నుండి పెద్దగా నటీనటులు లేకపోయినా, సౌత్ లో పేరుమోసిన తారాగణం ఈ సినిమాలో చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు హీరోహీరోయిన్లు నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జె సూర్య, సాయి కుమార్ వంటి వాళ్లనే సినిమా నుండి పరిచయం చేయగా, తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రధారులందర్నీ చిత్ర యూనిట్ రివీల్ చేసారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేయగా, ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల్ని రివీల్ చేసి సినిమాపై అంచనాలని పాన్ ఇండియా రేంజ్ లో పెంచేశారు.

- Advertisement -

స్టార్ కాస్ట్ ఇంతమందా?

ఇక సరిపోదా శనివారం (SaripodhaaSanivaaram) సినిమాలో నటిస్తున్న నటీనటుల ప‌లు పాత్ర‌ల‌ను మేకర్స్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు. వారి పాత్రలను ఒకసారి గమనిస్తే… ఈ సినిమాలో నారాయ‌ణ ప్ర‌భ గా ప్ర‌ముఖ నటుడు అజ‌య్ ఘోష్, ఆయ‌న అనుచ‌రులుగా కాళి, మార్టిన్ ల పాత్రలను కూడా పరిచయం చేసారు. అలాగే కూర్మానంద్ గా ముర‌ళీశ‌ర్మ‌, గోవ‌ర్ధ‌న్ గా అజ‌య్, భ‌ద్ర‌గా అదితి బాల‌న్ ల‌తో పాటు ది వ‌ర‌ల్డ్ ఆఫ్ సోకుల‌పాలెం అంటూ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టులని కూడా చూపించారు. అలాగే సుధా గా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, క‌మ‌లాక‌ర్ గా శుభ‌లేఖ సుధాక‌ర్, శంకరం గా సాయి కుమార్, ఛాయాదేవిగా అభిరామి నటిస్తున్నారు. ఇక ఒకేసారి ఇంతమంది నటీనటుల్ని రివీల్ చేయడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న విషయం తెలిసిందే. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంట‌ర్టైన్మెంట్స్ పై దాన‌య్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగ‌స్టు 29న వ‌ర‌ల్డ్ వైడ్ గా సరిపోదా శనివారం సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయ‌నున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు