Niharika Konidela : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఏం గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు.. సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆయన చెయ్యవలసిన సినిమాలు అన్ని కూడా ఇప్పుడు దుకాణ్ బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.. అయితే ఆయన సినిమా చేస్తాడా? లేదా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మెగా డాటర్ నిహారిక సంచలన వ్యాఖ్యలు చేసింది.. అది కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..
నిహారిక కొణిదెల ఇటీవలే కొత్త ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.. పింక్ ఏలిఫెంట్ అనే కొత్త ప్రొడక్షన్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. గతంలో ఈ బ్యానర్ పై వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఆ సిరీస్ అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు.. ఆ తర్వాత కమిటీ కుర్రోళ్ళు సినిమాను ఆ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి..
ఆ ఈవెంట్ లో నిహారిక మాట్లాడుతూ.. బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఏం అయ్యాడు మాకు సంతోషంగా ఉంది. ఆయన అంత పెద్ద పదవిలో ఉన్నా కూడా మాకు మాత్రం పవర్ స్టార్ అని తన బాబాయ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. బాబాయ్ ఇచ్చే స్పీచ్ లు చాలా బాగుంటాయి.. అని నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తాయంటూ చెప్పుకొచ్చిన నిహారిక… ఇప్పుడు నేను డిప్యూటీ సీఏం గా బాబాయ్ చేస్తున్న పనులు నాకిష్టమని చెప్పింది. అలాగే తన ఫోన్ లో బాబాయ్ పేరును కేకేకే అని సేవ్ చేసుకున్నట్లు చెప్పింది.. దానికి అర్థం కూడా చెప్పింది. కొనిదెల కళ్యాణ్ కుమార్ అంటూ చెప్పుకొచ్చింది. నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటో తెలుసా అనే వార్తలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి..