Urfi Javed: డ్రెస్సింగ్ స్టైల్ లో కొత్త ప్రయోగం… పిల్లలు కూడా ఫిదా..!

Urfi Javed.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈమె సినిమాలకంటే కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రకరకాల దుస్తుల ధరించి అందర్నీ ఆకట్టుకునే ఈమె ప్రత్యేకంగా ఆకులు , ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ ముక్కలు, పేపర్లు ఇలా ఏది దొరికితే వాటితో డ్రెస్ డిజైన్ చేయించుకొని ధరిస్తూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిత్ర విచిత్ర దుస్తులకు పెట్టింది పేరు ఉర్ఫీ జావేద్.. అందుకే ఈమెకు సోషల్ మీడియాలో కూడా అభిమానులు ఎక్కువే. ఈమె ఫ్యాషన్ ను ఫాలో అయ్యే యువత కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా రంగురంగుల దుస్తులతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఈసారి చిన్నపిల్లలను సైతం ఆకట్టుకునేలా డ్రెస్సింగ్ స్టైల్ లో కనిపించింది.

Urfi Javed: A new experiment in dressing style... children are also fida..!
Urfi Javed: A new experiment in dressing style… children are also fida..!

డిజిటల్ టీషర్ట్ లో కనిపించి ఉర్ఫీ..

తాజాగా డిజిటల్ టీషర్టు ధరించిన ఉర్ఫీ జావేద్ తన అందచందాలతో మరొకసారి మాయ చేసిందని చెప్పవచ్చు. స్లీవ్ లెస్ మినీ ఫ్రాక్ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ టీ షర్టు పై డిజిటల్ నంబర్స్ రావడంతో ఇది కాస్త అందరిని ఆకట్టుకుంటుంది .ఇక్కడ బటర్ఫ్లై తో పాటు వివిధ రకాల పక్షులు ఎగరడాలు, టపాసులు పేలడాలు, మొత్తం భూగోళమే తిరుగుతున్నట్టు ఇలా ఒక్కటేమిటి ఎన్నో వింత వింత ఆకారాలు ఈమె డ్రెస్ పై మనకు కనిపించాయి. ఈ డ్రెస్ పిల్లలను భలే ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.అయితే తాజాగా ఇదంతా చూస్తుంటే ఈమె డ్రెస్ పైన వీటిని ప్రొజెక్ట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించడంతో ఈమె అందాలు మరింత రెట్టింపవుతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తోంది.

ఉర్ఫీ జావేద్ కెరియర్..

ఉర్ఫీ జావేద్ టీవీ నటిగా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 1997 అక్టోబర్ 15 జన్మించింది. లక్నోలోనే చదువు పూర్తి చేసి సిటీ మాంటిస్సోరి స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. కమిటీ యూనివర్సిటీ నుండి మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పొందిన ఊర్ఫీ 2017 నుంచి ఒక సంవత్సరం పాటు మేరీ దుర్గా సహనటుడు పరాస్ కల్నావత్ తో డేటింగ్ చేసింది. 2022లో న్యూమరాలజిస్ట్ సలహా మేరకు తన పేరును స్పెల్లింగ్ లో కూడా మార్చుకుంది. ఇక 2016లో సోనీ టీవీలో ప్రసారం చేసిన బడే భయ్యా కి దుల్హనియా చిత్రంలో అలరించింది. ఆ తర్వాత స్టార్ ప్లస్ లో 2015 నుండి 2016 వరకు చంద్ర నందిని లో ఛాయా పాత్ర కూడా పోషించింది.. ఇక హిందీ బిగ్ బాస్ ఓటీటీ లో మొదటి సీజన్ లోక్ కూడా పోటీ పడింది. అలాగే 2022 కున్వార్ తో కలిసి ఒక మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ లకు పరిమితమైన ఈమె ఇలా తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు