Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతో మంది యువతను ఆకట్టుకున్నారు.. ఈయన సినిమాలు తెలుగులోనే వచ్చినప్పటికీ యావత్ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు కోరుకున్నారు.. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా జనసేన పార్టీని స్థాపించి ఈసారి కూటమితో పొత్తు పెట్టుకుని, 21 స్థానాలలో పోటీ చేసి 21 స్థానాలను కైవసం చేసుకుని, 100% స్ట్రైక్ తో రికార్డు సృష్టించారు.. ముఖ్యంగా అభిమానుల కోరికను మరింత బలం చేశారు పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్..
ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు? అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఎందుకంటే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట పెద్దల బలవంతం మేరకు నందిని రెడ్డిని వివాహం చేసుకున్న ఈయన , ఆ తర్వాత ఆమెతో ఎక్కువ కాలం నిలవలేకపోయారు. ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడి పెళ్లికి ముందు ఒక బిడ్డకు జన్మనిచ్చి పెద్దల సమక్షంలో బిడ్డ ముందు వివాహం చేసుకొని మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఆమెతో కూడా ఎక్కువ కాలం ఉండలేక విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత రష్యాకి చెందిన అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నారు.
ఫస్ట్ క్రష్ అదే…
ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు అంటూ వార్తలు రాగా.. రివాల్వర్ అని ఆయన గతంలో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ గురించి ఎన్నోసార్లు బహిరంగంగానే వెల్లడించిన విషయం తెలిసిందే. మొదట ఎఫైర్ పెట్టుకున్నది తన గన్ తోనే అని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాదిగా మారే అవకాశం..
అయితే ఈ విషయం తెలుసుకున్న తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉగ్రవాద ఉద్యమాలలో తిరుగుతాడేమో అని భయపడ్డారట.. గన్ అంటే పవన్ కళ్యాణ్ కు ఇష్టం మాత్రమే కాదు నిద్రపోయేటప్పుడు కూడా దానిని పక్కలోనే పెట్టుకొని నిద్రించేవాడట. లేవగానే మొదటి ముద్దు దానికే ఇచ్చానని అదే నా ఫస్ట్ లవ్ అని కూడా పవన్ కళ్యాణ్ గతంలో వెల్లడించారు.. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించి తెలిసి ఇది ఊహించలేదు కదా ఎవరైనా అమ్మాయి అనుకున్నాం కానీ ఈయన గన్ అని చెప్పి ఆశ్చర్యపరిచాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.