Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాల ఆపేస్తున్నారా.? కన్ఫ్యూజన్ లో పడేసిన ప్రొడ్యూసర్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసినవి తక్కువ సినిమాలు అయినా కూడా విపరీతమైన క్రేజ్ సాధించుకున్నాడు. ఒక డిజాస్టర్ సినిమాతో కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మామూలుగా ఒక సినిమాకి డిజాస్టర్ టాక్ వస్తే ఆ సినిమా రెండో రోజుకు మూడో రోజుకు కలెక్షన్ ను విపరీతంగా పడిపోతాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా మినిమం కలెక్షన్లు వస్తాయి. కేవలం పవన్ కళ్యాణ్ చూడడానికే థియేటర్ కి వెళ్లే ఆడియోస్ కూడా ఉన్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసి వరుసగా ఏడు హిట్ సినిమాలు అందుకున్నాడు. ఖుషి సినిమా తర్వాత దాదాపు 10 సంవత్సరాలు హిట్ లేకపోయినా కూడా ఫ్యాన్ బేస్, మార్కెట్ రెండు పెరిగే తప్ప ఇంచ్ కూడా తగ్గలేదు. ఇక గబ్బర్ సింగ్ సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ స్టామినా ఏంటో ఇండస్ట్రీకి తెలిపిన సినిమా అది. ఇక ఆ తర్వాత అత్తారింటికి దారేది కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటివరకు మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. మీరు కాంబినేషన్లో చివరగా వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దాదాపు సినిమాలు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ త్రివిక్రమ్ వాళ్ళని రీ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేసింది సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ చాలా ప్రాజెక్టుకి సైన్ చేశాడు. అందులో రామ్ తల్లూరి నిర్మాతగా వ్యవహరించిన ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు అని అనౌన్స్ కూడా చేశారు.

- Advertisement -

Pawan Kalyan

ఫ్యాన్స్ లో ఆందోళన

ఇక రీసెంట్ గా రామ్ తల్లూరి ఈ సినిమా గురించి స్పందించారు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పై అనౌన్స్ చేసిన ఈ సినిమా ఖచ్చితంగా జరుగుతుందంటూ చెప్పారు. ఇకపోతే అసలు పవన్ కళ్యాణ్ కి సినిమాలు చేసే ఉద్దేశం ఉందా అని అడిగినప్పుడు. ఆ నిర్మాత కొంచెం కన్ఫ్యూజన్ తో వీలు చూసుకుని సినిమాలు చేస్తారండి అంటూ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చాలామందికి వీలు చూసుకుని సినిమాలు చేయటం ఏంటి అని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ సమాజం గురించి ఎంతలా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పదవి లేనప్పుడే ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి మొదలుపెట్టిన సినిమాలను పూర్తి చేసి పూర్తిస్థాయి రాజకీయాలకి పరిమితం అవుతారా అని ఆలోచనలు మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు