Raja Saab : టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో అంటే టక్కున ప్రభాస్ పేరే వినిపిస్తుంది.. గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాడు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.. ఈ ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి.. ఇప్పుడు మరో నాలుగు సినిమాలతో రాబోతున్నాడు డార్లింగ్.. అందులో రాజా సాబ్ సినిమా ఒక్కటి.. ఇప్పటివరకు ఈ సినిమా అప్డేట్స్ అన్ని అంచనాలు పెంచేస్తున్నాయి..
బాహుబలి తర్వాత ప్రభాస్ కు అంతటి విజయాన్ని అందించిన సినిమా అంటే కల్కి .. ఈ సినిమా తర్వాత అందరి చూపు రాజా సాబ్ మీద పడింది. ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలయ్యిన పోస్టర్ పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హర్రర్ కామెడీ కాన్సెప్టుతో రాబోతుంది. వాస్తవానికి దీనికి సంబంధించిన ప్రకటన అయితే అధికారికంగా రాలేదు. అయితే షూటింగ్‌ను మాత్రం ఎప్పుడో మొదలు పెట్టారు.. ఇప్పటికీ విడుదల గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.
రాజా సాబ్ సినిమా నుంచి గ్లింప్స్ వీడియోను విడుదల చేయబోతున్నారు. దీన్ని జూలై 29వ తేదీన సాయంత్రం 5:03 గంటలకు వదలబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను సైతం వదిలింది.. ఆ పోస్టర్ లో డార్లింగ్ చాలా స్టయిల్ గా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మారుతి సినిమాల్లో హీరోలకు ఏదొక లోపం ఉన్నట్లు చూపిస్తాడు. మరి ప్రభాస్ కు ఎలా డిఫెక్ట్ ఉందని చూపిస్తాడో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మాత్రం రేపు వచ్చే గ్లింప్స్ వీడియోను మిస్ అవ్వకుండా చూడాలి.. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు..