Pushpa : పుష్ప సినిమాను ఎంతమంది రిజెక్ట్ చేశారో తెలుసా?

Pushpa : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో అందరికీ తెలిసిందే.. ఆ సినిమా నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకోవడం తో పాటుగా భారీగా కలెక్షన్స్ ను కూడా రాబట్టింది.. ఈ సినిమా 2020 లో విడుదల అయ్యింది. ఇప్పుడు సీక్వెల్ గా మరో సినిమాగా పుష్ప 2 సినిమా రాబోతుంది.. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఎన్ని మార్కులు పడ్డాయో.. జగదీశ్ క్యారెక్టర్ కు అన్ని మార్కులు పడ్డాయి. అయితే ఈ పాత్రను చెయ్యడం కోసం సుక్కు కొందరిని అనుకున్నాడట.. కానీ వారంత రిజెక్ట్ చేశారట.. ఆ క్యారెక్టర్ ను ఎవరు రిజెక్ట్ చేసారన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బుల్లితెర పై సీరియల్స్ లో హీరోగా రానిస్తూ మంచి టాక్ ను సొంతం చేసుకున్న రవి కృష్ణ.. బిగ్ బాస్ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవి కృష్ణ.. పుష్ప సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌కు సుకుమార్ అప్రోచ్ అయ్యారట. అప్పటికే లవ్ మీ ఇఫ్ యు దేర్ సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను పక్కన పెట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

Do you know how many people rejected Pushpa's movie?
Do you know how many people rejected Pushpa’s movie?

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ రోల్ అవకాశం వచ్చిన దానిని రిజెక్ట్ చేశాడట.. అలాగే హీరో సుహాస్ ను కూడా సంప్రదించారట అతను సినిమాలు ఉండటంతో రిజెక్ట్ చేశాడట.. ఇక మహేష్ విట్టా కూడా ఈ సినిమాను పక్కన పెట్టినట్లు టాక్..

- Advertisement -

ఇక సమంత బాలీవుడ్ లో బిజీగా ఉండటం వల్ల మొదట ఐటమ్ సాంగ్ కు నో చెప్పిందట.. ఆ తర్వాత దిశా పటానిని అనుకున్నారట.. ఇక సామ్ ఒకే చెప్పడంతో ఆమెతో ఐటమ్ సాంగ్ ను చేయించారు.. ఆ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే..

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ ఈ సినిమాను ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.. ఈ సినిమా వాయిదా మీద వాయిదా పడుతూ వస్తుంది. కనీసం ఈ డేట్ న అయిన వస్తుందేమో చూడాలి…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు