Mr Bachchan : వివాదాల సద్దుమణిగాయా.? లేదంటే ఇది ప్రమోషన్ స్టంట్ ఆ.?

Mr Bachchan: డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్ని అవసరమైన విషయాలకి మరికొన్ని అనవసరమైన విషయాలకి స్పందించడం హరీష్ కి అలవాటైపోయింది. చాలా ఊహగానాలకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెక్ పెడుతుంటాడు హరీష్. ఒక హరీష్ శంకర్ నుంచి చివరగా వచ్చిన సినిమా గద్దల కొండ గణేష్. ఇప్పటివరకు ఆ సినిమా తర్వాత హరీష్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. జిగర్తాండ అనే సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు హరీష్ శంకర్.

మిస్టర్ బచ్చన్ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా స్టార్ట్ అయింది. అయితే ఆ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ తక్కువ రోజులు డేట్ లు ఇచ్చిన కూడా మంచి అవుట్పుట్ లాగాడు హరీష్. తక్కువ రోజుల కాల వ్యవధిలోనే రెండు టీజర్లను కూడా రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ ఇష్టపడతారు బాగా తెలిసిన ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్. ఇక పవన్ కళ్యాణ్ ఇతర ప్రాజెక్టులో వాళ్ళని బిజీగా మారడంతో ఈలోపు ఇంకో సినిమా చేసేద్దాం అని రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను మొదలుపెట్టి దాదాపు పూర్తి చేసేసాడు.

Harish Shankar

- Advertisement -

మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15 రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి టీజర్ నేడు రిలీజ్ కానుంది. ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ ను ఒక జర్నలిస్ట్ తన ట్విట్టర్ వేదికగా రాశాడు. అక్కడితో జర్నలిస్టుకి దర్శకుడు హరీష్ శంకర్ కి మధ్య ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి. ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా తీవ్రంగా జరిగాయి. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ కి ఆ జర్నలిస్టుకి మధ్య ఒక ఇంటర్వ్యూ జరిగినట్లు అధికారక ప్రకటన వచ్చింది. ఇప్పుడు దీనిపై కొంతమంది మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ప్రమోషనల్ స్టంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే వివాదాలు సద్దుమనిగి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు