Bollywood Hero.. సాధారణంగా ఎవరికి టైం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. అందుకే కాలం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే బాగా సంపాదిస్తున్నప్పుడే భవిష్యత్తును ఆలోచించి డబ్బు దాచుకోవాలని చాలామంది సెలబ్రిటీలు నిరూపించారు కూడా. ఇదిలా ఉండగా ఒక హీరో పరిస్థితి చూస్తే మాత్రం ఓడలు బండ్లు అయ్యాయని తెలుస్తోంది. ఇండియాలోనే ఒక స్టార్ హీరో రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. కానీ ప్రస్తుతం ఈయన రేంజ్ కేవలం రూ.30 కోట్లకు పడిపోయింది. మరి ఇంతకూ ఆ హీరో ఎవరు? ఎందుకు ఆయన పరిస్థితి దిగజారింది..? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు రూ.100 కోట్లకు పైగా పారితోషకం..
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే హీరోల పారితోషకం మాత్రం వందల కోట్లకు ఎగబాకుతోంది.. చిన్న హీరోలు కూడా ఈ మధ్య రూ.30 కోట్లకు తక్కువ తీసుకోవడం లేదు. ముఖ్యంగా వారి సినిమాలకు ఫస్ట్ రోజు కనీసం రూ.3 కోట్లు కూడా రావడం లేదు అంటూ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఇటీవల తెలియజేశారు. బాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ ఒకప్పుడు వరుస హిట్లతో సునామీ సృష్టించి రూ.100కోట్ల పారితోషకం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎంతో ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.
రూ.30 కోట్లకు దిగజారిన హీరో..
అసలు విషయంలోకెళితే ఒకప్పుడు యమ క్రేజ్ దక్కించుకున్న ఈయన ఇప్పుడు వరుస సినిమాలు డిజాస్టర్ చవిచూస్తున్నాయి. బచ్చన్ పాండే సినిమాతోనే ఈయన పతనం మొదలైంది. వరుసగా 9 డిజాస్టర్లు చవిచూశాడు. తన లాస్ట్ సినిమాకు ఏకంగా రూ.165 కోట్ల పారితోషకం తీసుకున్న ఈయన ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఆయన రేటు రూ.100 కోట్లు దాటినా నుంచి ఎక్కువగా ఫ్లాప్లే చూస్తున్నాడు. దాంతో నిర్మాతలు కూడా ఈయనకు ఈ రేంజ్ లో పారితోషకం ఇవ్వడం భారంగా భావిస్తున్నారు. దీంతో అక్షయ్ కుమార్ చివరికి తన పారిపోషకం కూడా తగ్గించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన సర్ఫీరా సినిమాకి కేవలం రూ .30 కోట్లు మాత్రమే తీసుకున్నారట.
కన్నప్ప పైనే ఆశలు..
అయితే ఒకప్పుడు రూ .150 కోట్ల పారితోషకం తీసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు కేవలం రూ.30 కోట్లకే పరిమితం అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కథల ఎంపిక విషయంలో తడబాటు పడడం వల్ల ఈ స్థితికి దిగజారారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇకనైనా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ఈ సినిమాలో మహాశివుడిగా కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా నైనా ఈయనకు తిరిగి పూర్వ వైభవాన్ని అందిస్తుందో లేదో చూడాలి.