Private jet: సొంత విమానం కలిగి ఉన్న తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరంటే..?

Private jet.. సాధారణంగా సినిమా షూటింగ్ లప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఒక్కొక్కసారి ప్రయాణం ఆలస్యం అవుతూ ఉంటుంది. అందుకే చాలామంది సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి భారీ సక్సెస్ అందుకున్న తర్వాత , డబ్బు పొంది సొంతంగా విమానాలను కూడా కొనుగోలు చేస్తున్నారు.. అయితే ఇదంతా హీరోల వరకే సాధ్యము అని అనుకుంటారు. కానీ హీరోయిన్లకి కూడా సొంత విమానాలు ఉన్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో సొంత విమానం కలిగి ఉన్న వారిలో నయనతార పేరు ప్రథమంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే నయనతార కంటే ముందే ఒక స్టార్ హీరోయిన్ కు సొంత విమానం ఉందట. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

Private jet: Who is the first South Indian heroine to have her own plane?
Private jet: Who is the first South Indian heroine to have her own plane?

సొంత విమానాలు కలిగి ఉన్న స్టార్స్..

హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఇప్పుడు భారీగా సంపాదిస్తున్నారు. అందుకే కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ లగ్జరీ లైఫ్ ని కూడా వారు లీడ్ చేస్తున్నారు.. విలాసవంతమైన భవనాలతో పాటు లగ్జరీ కార్లు, బైకులను రూ.కోట్లు పెట్టి కొంటూ ఉంటారు.. అయితే అందులో కొంతమంది సొంత విమానాలు కూడా కొనుగోలు చేశారు. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్టార్ హీరో హీరోయిన్లలో రామ్ చరణ్, నాగార్జున, ఎన్టీఆర్, నయనతార, రజనీకాంత్ , కమల్ హాసన్ వంటి చాలామంది స్టార్స్ కి సొంత విమానాలు ఉన్నాయి. మరి ఎక్కడికైనా దూరంగా వెళ్లాలి అంటే కచ్చితంగా వారు తమ ఫ్లైట్స్ ని ఉపయోగిస్తారు.

దక్షిణాదిలో మొదటి సొంత విమానం కలిగిన హీరోయిన్..

ఈ క్రమంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలో దాదాపు 45 ఏళ్ల క్రితమే ఒక హీరోయిన్ వెండితెరను ఏలింది. అంతే కాదు ఆమె సొంతంగా విమానాన్ని కూడా కొనుగోలు చేసింది.. ఆమె ఎవరో కాదు కె.ఆర్ విజయ. అప్పట్లోనే ప్రైవేట్ జట్టును సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియన్ నటిగా రికార్డ్ సృష్టించింది కే.ఆర్.విజయ. ఈమె తమిళ్ నటి.. 1970 లలో టాప్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. అనతి కాలంలోనే బిజీ నటిగా మారిపోయి, ప్రతి ఏడాది పదికి పైగా సినిమాలను విడుదల చేసేది. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటిది నటులతో నటించి అంతకుమించి క్రేజ్ దక్కించుకున్న ఈమె ఒక తమిళ చిత్రాలలోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించి, దక్షిణాది స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అలా దాదాపు 500 కు పైగా చిత్రాలలో నటించిన ఈమె తన అద్భుతమైన నటనతో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడిచింది.

- Advertisement -

ఓడలు , హోటల్లు కూడా..

ఇక అప్పట్లోనే అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ కూడా ఈమె కావడం గమనార్హం . పైగా ఖరీదైన బంగ్లాలు, కోట్ల ఆస్తి ఈమె సొంతం. దాంతో ఒక ప్రైవేటు జెట్ ను కూడా ఈమె కొనుగోలు చేసింది. అంతేకాదు అప్పుడప్పుడు ఆలస్యం అయితే తన సొంత విమానంలోనే షూటింగ్ కి వచ్చే వారట కేఆర్ విజయ. పైగా ఈమె భర్త కూడా పెద్ద వ్యాపారవేత్త కావడం ఈమెకు బాగా కలిసి వచ్చింది. ఆయనకు హోటల్ , ఓడలు లాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా ఉన్నాయట. ఇక మరోవైపు ఈమె వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో కూడా నటనను వదులుకోకుండా బామ్మ పాత్రలో నటిస్తూ అలరిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు